Postel Department : పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. టెన్త్ అర్హత, వేతనం రూ. 63,200..!
Postel Department : పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. టెన్త్ అర్హత, వేతనం రూ. 63,200..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
భారత ప్రభుత్వం పోస్టర్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. పదవ తరగతి చదివిన వారికి అవకాశం కల్పించారు. ఇదో గొప్ప అవకాశంగా.. అర్హత ఉన్నవారు భావించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. 2025 జనవరి 12వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ. మొత్తం 19 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాసుదారుడు ఏదైనా యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 27 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి ఎంపిక అయితే 19,900 రూపాయల నెలవారి వేతనం నుంచి 63,200 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులకు బీహార్ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించిన తర్వాత ఇంటర్వ్యూ ద్వారా వారిని ఎంపిక చేస్తారు.
MOST READ :
-
Gold Price : పసిడి ధర మళ్లీ భారీగా తగ్గింది.. తులం ఎంతంటే..!
-
Ration Dealers : నీరుద్యోగులకు శుభవార్త.. రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
-
PrajaPalana : ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, రూ.500 వంటగ్యాస్.. మళ్లీ ప్రజా పాలన దరఖాస్తులకు అవకాశం..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై సీలింగ్.. వారికి మాత్రమే.. లేటెస్ట్ అప్డేట్..!









