Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలు

Karimnagar : భార్యపై పెట్రోల్, యాసిడ్‌తో దాడి..!

భార్యపై అనుమానంతో ఆమెపై పెట్రోల్, యాసిడ్‌ పోసి, కారంపొడి చల్లి నిప్పంటించేందుకు యత్నించిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

Karimnagar : భార్యపై పెట్రోల్, యాసిడ్‌తో దాడి..!

హత్యాయత్నం కేసులో భర్త అరెస్టు.. తండ్రి పరారీ

కరీంనగర్ బ్యూరో, మనసాక్షి :

భార్యపై అనుమానంతో ఆమెపై పెట్రోల్, యాసిడ్‌ పోసి, కారంపొడి చల్లి నిప్పంటించేందుకు యత్నించిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన చింతకుంట ప్రభుత్వ పాఠశాల సమీపంలో చోటుచేసుకుంది. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్‌ తెలిపిన వివరాల మేరకు.. చింతకుంటకు చెందిన మొలంగూరు అనూషకు సుమారు 16 ఏళ్ల క్రితం ఆంజనేయులుతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also Read : రెండు రోజుల క్రితం ఓయోలో దిగిన జంట.. రక్తపు మడుగులో యువతి.. పరారీలో యువకుడు..!

కొంతకాలంగా అనూష ఓ వ్యక్తితో చనువుగా ఉంటోందనే అనుమానంతో ఆంజనేయులు ఆమెతో తరచూ గొడవపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కిసాన్‌నగర్‌లో ఉంటున్న అనూష కదలికలను గమనించిన ఆంజనేయులు.. మంగళవారం ఆమె చింతకుంట ప్రభుత్వ పాఠశాల వద్దకు రాగానే తన తండ్రి లక్ష్మీనారాయణతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అనూషతో మాట్లాడాల్సి ఉందంటూ పక్కకు పిలిచిన ఇద్దరూ ముందస్తు పథకం ప్రకారం ఆమెపై పెట్రోల్, యాసిడ్‌ పోసి, కారంపొడి చల్లినట్లు సీఐ తెలిపారు.

Also Read : కళ్ల ఎదుటే కారు దగ్ధం.. తండ్రి సజీవ దహనం, కొడుకుని కాపాడిన స్థానికులు..!

అనంతరం అగ్గిపెట్టెతో నిప్పంటించేందుకు ప్రయత్నించగా అనూష గట్టిగా కేకలు వేయడంతో పాఠశాల ఉపాధ్యాయులు బయటకు వచ్చారు. దీంతో ఆంజనేయులు, లక్ష్మీనారాయణ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు మొలంగూరు అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడైన మొలంగూరు ఆంజనేయులును అరెస్టు చేసినట్లు సీఐ బిల్లా కోటేశ్వర్‌ తెలిపారు. కేసులో ఏ2గా ఉన్న మొలంగూరు లక్ష్మీనారాయణ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు