Education : తెలంగాణలో కెసిఆర్ విద్యా కానుక..!
Education : తెలంగాణలో కెసిఆర్ విద్యా కానుక..!
హైదరాబాద్ , మనసాక్షి :
ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో విద్యార్థుల కోసం విద్యా కానుక పథకాన్ని కొత్తగా తీసుకురానున్నారు. ఇప్పటికే వివిధ రకాల సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో విద్యార్థులకు కొత్త పథకాన్ని తీసుకురానున్నారు .
బీసీ సంక్షేమంపై ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శాసనమండలిలో మాట్లాడుతూ త్వరలోనే కెసిఆర్ విద్యా కానుక పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో “ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల”పై అనే అంశంపై శాసనమండలిలో చర్చ జరిగింది.
ఈ విషయంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలు తలెత్తుకొని తిరిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని పేర్కొన్నారు. కెసిఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల బీసీల్లో ఆత్మ గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. త్వరలో విద్యా కానుక పథకాన్ని ప్రారంభిస్తారని ప్రకటించారు.
దళితుల సంక్షేమానికి కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజన వర్గాలను కెసిఆర్ జనజీవంలో ఉన్నత స్థానంలో నిలుపుతున్నారన్నారు.
ALSO READ :










