Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. వారికి అండగా ప్రభుత్వం..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. వారికి అండగా ప్రభుత్వం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నిరాశ్రయులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రభుత్వ సేవలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మంగళవారం సూర్యుడు ఉదయించక ముందే మిర్యాలగూడ కేంద్రంలో ప్రకాష్ నగర్ లోని నిరాశ్రయుల విశ్రాంతి భవనం ఆకస్మిక తనిఖి చేశారు. నిరాశ్రయులతో ముఖా ముఖి మాట్లాడి వారి యోగ క్షేమాలను కనుక్కున్నారు.

ఆశ్రమంలో ని సైదిరెడ్డి అనే వ్యక్తితో జిల్లా కలెక్టర్ అతని యోగక్షేమాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీది ఏ ఊరు ?ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు? అని అడిగారు. తనది గుర్రప్ప గూడెం అని, నెల రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నానని చెప్పారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరాశ్రయుల భవనాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విశ్రాంతి గదిలో శుచిత భోజనం, ఆరోగ్య పరీక్షలు సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, తహసీల్దార్ సురేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ , ఆర్ఐ రామకృష్ణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Devarakonda : గ్రామ పంచాయతీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట.. ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్..!

  2. Miryalaguda : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మిర్యాలగూడ నియోజకవర్గం గ్రామాల వారీగా వివరాలు ఇవీ..!

  3. Miryalaguda : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మిర్యాలగూడ నియోజకవర్గం గ్రామాల వారీగా వివరాలు ఇవీ..!

  4. Rythu Bharosa : రైతు భరోసా కు వేళాయే.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

మరిన్ని వార్తలు