Rythu Bharosa : రైతు భరోసా పై తుమ్మల కీలక వ్యాఖ్యలు.. ఈ సీజన్ కు లేనట్టేనా..?
Rythu Bharosa : రైతు భరోసా పై తుమ్మల కీలక వ్యాఖ్యలు.. ఈ సీజన్ కు లేనట్టేనా..?
హైదరాబాద్, మన సాక్షి :
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందజేయాల్సిన రైతు భరోసా పథకం పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15 వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందజేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎకరానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది మాసాలకు పైగా గడుస్తున్నప్పటికీ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించలేదు.
గత యాసంగి సీజన్ లో రైతుబంధు పథకం పేరుతోనే ఒక విడతకు గాను ఎకరానికి 5000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశారు. వానాకాలం సీజన్ లో రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని ఎన్నో పర్యాయాలు మంత్రులు, ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ వానకాలం సీజన్ కూడా ముగిసింది.
వరి కోతలు కూడా ప్రారంభమయ్యాయి దాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించారు. అయినా కూడా రైతు భరోసా పథకాన్ని ఇప్పటివరకు ప్రారంభించలేదు. కాగా ఈ పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.
పంటలు వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సీజన్ కు రైతు భరోసా పథకం ఉంటుందా..? లేదా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. రైతు భరోసా పథకంకు బదులు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు సమాచారం.
ఈ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్థిక వెసులుబాటు లేకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ అంశాన్ని తన భుజాన వేసుకొని మాఫీ చేశారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
రాష్ట్ర మొత్తంగా 42 లక్షల మంది లబ్ధిదారులకు 25 లక్షల కుటుంబాలకు 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉండగా, ఆగస్టు 15వ తేదీ నాటికి 18 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని రెండు లక్షల రూపాయల రుణాలు పైన ఉన్నవారికి రుణమాఫీ, పైన ఉన్న డబ్బులు కడితే మాఫీ అవుతుందని పేర్కొన్నారు. తెల్ల కార్డు లేని సుమారు మూడు లక్షల మందికి డిసెంబర్ లో రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా ఈనెల 23వ తేదీన నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో కూడా రైతులు అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు రైతుల పంటల బీమా, అన్నదాతకు అందించే బోనస్ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఇవన్నీ అయ్యాకనే రైతు భరోసా పథకం గురించి ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంది. అందుకు ఈ సీజన్ కు రైతు బారోస పథకం అందే అవకాశాలు లేవు. ఇది ఇలా ఉండగా ఈ సీజన్‌లో రైతు భరోసా అందించకుంటే యాసంగి సీజన్ కైనా అందిస్తారా..? లేదా..? అనేది రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఇవి కూడా చదవండి :
-
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త.. రేషన్ కార్డులు లేకున్నా మాఫీ.. ఎప్పటి వరకో చెప్పిన తుమ్మల..!
-
Rythu Bharosa : రైతు భరోసాకు రూ.7500 కోట్లు.. స్పష్టం చేసిన మంత్రి తుమ్మల..!
-
Viral Video : భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు.. భార్య చేసిన పనికి షాక్.. (వీడియో)
-
Viral Video : అయ్య బాబోయ్.. ఎంత అదృష్టవంతురాలో ఆమె.. (వీడియో)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)









