Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పదవులు రద్దు..!

TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పదవులు రద్దు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని అదనపు కలెక్టర్లని ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం తాజాగా సర్వే అటవీ సరిహద్దుల సెటిల్మెంట్లు పథకాన్ని రద్దు చేసింది. ఈ పథకం కింద పని చేసే జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేసింది. ఇతర సిబ్బందిని కూడా విధుల నుండి విడుదల చేసింది.

సర్వే పూర్తయ్యే వరకు జిల్లా రెవెన్యూ అధికారులు, జిల్లా అటవీ అధికారులు, అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని ఆదేశించింది. అటవీ సెటిల్మెంట్ అధికారుల పనిని ఆయా జిల్లాల రెవెన్యూ అడిషనల్ కలెక్టర్లకు అప్పగించింది.

దాంతో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్లు ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారులుగా వ్యవహరించనున్నారు. అటవీ భూమిని రిజర్వు ఫారెస్ట్ గా ప్రకటించడానికి ముందు ఏమైనా అభ్యంతరాలు కూడా ఉంటే వాటిని అడిషనల్ కలెక్టర్లు పరిష్కరిస్తారు. దాంతో పాటు ఇతర అటవీ సమస్యలు కూడా వారే పరిష్కరించనున్నారు.

MOST READ : 

  1. State Level Badminton : రాష్ట్రస్థాయి బాడ్మింటన్‌ పోటీలకు శరణ్య ఎంపిక..!

  2. Hello Srinivas : హలో శ్రీనివాస్.. విశిష్టమైన ఐక్యత.. 26న శ్రీనివాస్ పేరు గల వ్యక్తుల ఆత్మీయ సమ్మేళనం..!

  3. District Collector : జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో కలిసి భోజనం..!

  4. PDS : అక్రమంగా రేషన్ బియ్యం రవాణా.. మహిళ అరెస్ట్, 20 క్వింటాళ్లు స్వాధీనం..!

మరిన్ని వార్తలు