Kisan App : పత్తి అమ్ముకునేందుకు కిసాన్ కాపస్ యాప్ తప్పనిసరి.. రైతులకు అవగాహన కల్పించిన అధికారులు..!

Kisan App : పత్తి అమ్ముకునేందుకు కిసాన్ కాపస్ యాప్ తప్పనిసరి.. రైతులకు అవగాహన కల్పించిన అధికారులు..!
పెన్ పహాడ్, మన సాక్షి :
పెన్ పహాడ్ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామం లో పత్తి పంట సాగు చేసిన రైతులకు కిసాన్ కాపస్ యాప్ పై మండల వ్యవసాయ అధికారి బి అనిల్ కుమార్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారి పి వికాస్ అవగన కల్పించినారు. ఈ కార్యక్రమం లో తమ్మనబోయిన మాధవరావు, సింగారెడ్డిపాలేం పత్తి పంట సాగు చేసిన రైతులు పాల్గొన్నారు.
సీసీఐ లో పత్తి పంట కొనగోలు విధానం కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాల్సిన విధానంపై రైతులకు సూచనలు చేశారు. రైతు మొదటగా కప్పాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి, స్లాట్ బుక్ చేసుకున్న తేదీన మాత్రమే మీ యొక్క పత్తిని మార్కెట్ కి తీసుకెళ్లాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి అంటే రైతు యొక్క ప్రస్తుత ఫోన్ నంబర్ మరియు పంట నమోదు లో రైతు యొక్క ఫోన్ నెంబర్ రెండు ఒకే నెంబర్ అయి ఉండాలి.
ఒకవేళ రైతు ప్రస్తుతం కొత్త నెంబర్ వాడుతున్నాట్లయితే ఆ యొక్క ఫోన్ నంబర్ ను మీ క్లస్టర్ యొక్క వ్యవసాయ విస్తరణ అధికారి ఏ ఈ ఓ వద్ద కొత్త నంబర్ ను అప్డేట్ చేయించుకోవాలి. పైన తెలిపిన సూచనల ప్రకారం రైతులు అనుసరించినట్లయితే పత్తి పంట అమ్ముకోవడం సులువు అవుతుందని మండల వ్యవసాయ అధికారి బానోతు అనిల్ కుమార్ తెలిపారు.
MOST READ :









