తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : జలదిగ్బంధంలో కొమ్మేపల్లి గురుకుల పాఠశాల.. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలు..!

Nalgonda : జలదిగ్బంధంలో కొమ్మేపల్లి గురుకుల పాఠశాల.. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలు..!

​దేవరకొండ, మనసాక్షి :

​భారీ వర్షాల కారణంగా నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల (బాలుర) ప్రాంగణం పూర్తిగా నీట మునిగి జలదిగ్బంధంలో చిక్కుకుంది. పాఠశాల ఆవరణలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో దాదాపు 530 మంది విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రాణాల ముప్పు: పాములు, తేళ్ల భయం

​పాఠశాల ఆవరణ నీట మునగడం నిన్నటి (రాత్రి) నుండి కరెంటు సరఫరా లేకపోవడం వంటి కారణాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పాఠశాల లోపలికి పాములు, తేళ్లు వంటి విష కీటకాలు ప్రవేశిస్తుండటంతో విద్యార్థులు మరింత భయభ్రాంతులకు గురయ్యారు. ఈ దుర్భర పరిస్థితుల కారణంగా విద్యార్థులు తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నారు.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

​సమాచారం అందుకున్న వెంటనే నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ తక్షణమే స్పందించారు. ఆమె కొమ్మేపల్లి గురుకుల పాఠశాలకు చేరుకుని పాఠశాల ప్రాంగణాన్ని మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించారు.
​కలెక్టర్‌తో పాటు దేవరకొండ ఏఎస్పీ మౌనిక,ఆర్డీవో రమణారెడ్డి, ఎమ్మార్వో మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో డానియల్, ఆర్సీఓ బలరాం నాయక్ తదితర సీనియర్ అధికారులు వెంటనే గురుకుల పాఠశాల వద్దకు చేరుకొని సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన పర్యవేక్షించారు.

అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మరియు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ కూడా పాఠశాల వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తక్షణమే విద్యార్థులకు తాగునీరు, ఆహారం, తాత్కాలిక వసతి ఏర్పాటుతో పాటు పాఠశాల ప్రాంగణం నుండి నీటిని తొలగించే ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అత్యవసర చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఏఎస్పీ మౌనిక, ఆర్సీఓ బలరాం నాయక్ పర్యవేక్షణలో గురుకుల పాఠశాల విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రక్రియ మొదలైంది. విద్యార్థులను తాత్కాలికంగా దేవరకొండ బీసీ గురుకుల పాఠశాల ఖాదర్ కాలేజీలో కు తరలిస్తున్నారు. ​వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు విద్యార్థులకు ప్రత్యామ్నాయ వసతిలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది.

MOST READ : 

  1. Heavy Rain : గుర్రంపోడులో భారీ వర్షం.. ఇళ్లల్లోకి చేరిన వరద నీరు, నీట మునిగిన పంటలు..!

  2. Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!

  3. Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!

  4. Cyber crime : టీవీ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే రూ.99 వేలు కొట్టేశారు..!

మరిన్ని వార్తలు