Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

KTR : అనుముల తిరుపతిరెడ్డి గారూ.. సామాన్యులకు ఆ.. కిటుకేదో చెప్పండి.. కేటీఆర్ ట్వీట్..!

KTR : అనుముల తిరుపతిరెడ్డి గారూ.. సామాన్యులకు ఆ.. కిటుకేదో చెప్పండి.. కేటీఆర్ ట్వీట్..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

హైడ్రా పై మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ట్వీట్ చేశారు. సామాన్యుల ఇండ్లు కూల్చివేయడానికి కనీసం 10 నిమిషాల సమయం కూడా ఇవ్వని హైడ్రా.. ముఖ్యమంత్రి సోదరుడు తిరుమలరెడ్డికి గడువు ఇచ్చిందంటూ ఆసక్తి కర ట్వీట్ చేశారు. ఈ విషయంపై తిరుమల రెడ్డి గారూ.. సామాన్యులకు ఆ కిటికేందో చెప్పు అంటూ ఆసక్తికర ట్వీట్ట్ చేశారు..

అనుముల తిరుపతి రెడ్డి గారు!

LKG చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు!

50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది!

72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది!
వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా….పేక మేడల కూల్చివేయబడింది!

తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా…మీ విషయంలో నోరు మెదపలేదు!

వాల్టా అనుకుంటా….ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు!

ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!

మీ సోదరుది బల్‌డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు