Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

KTR : కేటీఆర్ సంచలన ఆరోపణ.. తెలంగాణలో భూ కుంభకోణం..!

KTR : కేటీఆర్ సంచలన ఆరోపణ.. తెలంగాణలో భూ కుంభకోణం..!

మన సాక్షి, హైదరాబాద్ :

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. శుక్రవారం హైదరాబాదులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో భూ కుంభకోణం జరుగుతోందని ఆయన ఆరోపించారు. బాలనగర్, నాచారం, జీడిమెట్లలో ఈ కుంభకోణం జరుగుతుందన్నారు.

ప్రతి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన భూమి అంటే ప్రజల సొమ్ము అన్నారు. ప్రభుత్వం భూములను స్వాహా చేస్తుందని ఆరోపించారు. పారిశ్రామిక భూములపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను వేశాడని ఆయన ఆరోపించారు. తెలంగాణలో 9292 ఎకరాల భూమిని స్వాహా చేయాలని చూస్తుందన్నారు.

సుమారు ఐదు లక్షల కోట్ల రూపాయలను కుంభకోణం జరుగుతుందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ఎక్కడ భూములు ఉన్నా.. రేవంత్ రెడ్డి ముఠా వాలిపోతుందన్నారు. ప్రభుత్వ భూములు దారా దత్తం చేసే విషయంపై న్యాయపోరాటం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రభుత్వ భూముల్లో ప్రజలకు అవసరమైన ఇందిరమ్మ ఇండ్లు, గాని ఇంకా పేదలకు అవసరమైనవి నిర్మించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా మా ప్రభుత్వం వస్తుందని దీనిపై విచారణ చేపడతామన్నారు.

MOST READ : 

  1. Nagarjuna Sagar : నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాంచ్ ప్రయాణం.. టికెట్ రేట్లు ఇవీ..!

  2. Good News : మీకు రేషన్ కార్డు ఉందా.. ఉచిత రేషన్ బియ్యం ఎప్పటి వరకంటే..!

  3. Khammam : ఖమ్మంలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త.. కూతురుపై కూడా..!

  4. Rythu : ఇదేం కండిషన్ మేడమ్.. డిఏపి కావాలంటే అవి తప్పనిసరిగా కొనాల్సిందే..!

మరిన్ని వార్తలు