Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Khammam : ఖమ్మంలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త.. కూతురుపై కూడా..!

Khammam : ఖమ్మంలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త.. కూతురుపై కూడా..!

మన సాక్షి, ఖమ్మం :
ఖమ్మం జిల్లా కేంద్రంలోని గట్టయ్య సెంటర్లో దారుణ సంఘటన చోటు చేసుకుందివ గోగుల సాయి వాణి( 36) అనే మహిళపై ఆమె భర్త భాస్కర్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆ సమయంలో అడ్డుకోబోయిన ఆమె కుమార్తె హర్షవర్తిని (14) పై కూడా దాడి చేయడంతో ఆమెకు కూడా గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన వారు ఖమ్మం పట్టణంలోని ఫంక్షన్ హాల్ లో నిందితుడు భాస్కర్ క్లీనర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ విషయాల వల్ల చిన్న చిన్న గొడవలతో మొదలైన వారి వివాదం ఇటీవల వేరుగా ఉంటున్నారు.

సాయి వాణి తన భర్త భాస్కర్ తో గొడవపడి ఆమె కుమారుడు, కుమార్తెతో కలిసి ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో అద్దె ఇంట్లో ఉంటుంది. ఆమెను తన భర్త ఎప్పుడు అనుమానిస్తూ హింసాత్మకంగా వేధిస్తుండేవాడు. దాంతో ఆమె కృంగిపోయి పిల్లలను తీసుకొని వేరుగా ఉంటుంది.

గురువారం తెల్లవారు జామున భాస్కర్ నేరడ గ్రామంలో నుంచి ఖమ్మం వచ్చి ఇంటి ముందు కాపు కాసి భార్యపై దాడి చేసి హత్య చేశాడు. ఆ సమయంలో కూతురు అడ్డుకోపోగా ఆమెపై కూడా కత్తితో దాడి చేయగా గాయాలయ్యాయి. కూతురు హర్షవర్ధని ని స్థానికులు తక్షణమే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని నిందితుడు భాస్కర్ ని అరెస్టు చేశారు.

MOST READ : 

  1. YS JAGAN : మాజీ సీఎం జగన్ కేసులో కీలక మలుపు.. నేడు నాంపల్లి కోర్టుకు హాజరు..!

  2. TG News : కేటీఆర్ కు బిగ్ షాక్.. ఫార్ములా ఈ కేసులో విచారణకు గవర్నర్ అనుమతి..!

  3. ACB : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సర్వేయర్..!

  4. ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి చిక్కిన ఎస్సై రాజేష్..!

మరిన్ని వార్తలు