Miryalaguda : ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉత్తరాల పంపిణీ..!
తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు 8 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ నుండి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉత్తరాల పంపిణీ చేయడం జరిగింది.

Miryalaguda : ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉత్తరాల పంపిణీ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు 8 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ నుండి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉత్తరాల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువు కోవాలంటే లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడ్డదన్నారు.
ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులను ఫీజులు కట్టాలని యాజమాన్యాలు వేధిస్తూ ఉంటే దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు చదువులను మానిసే పరిస్థితి మన తెలంగాణలో ఏర్పడడం బాధాకరం అన్నారు. విద్యాశాఖ మంత్రిగా స్వయంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతా ఉంటే కూడా ఎందుకు స్పందించడం లేదని ఆయన అన్నారు.
మరోపక్క కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ప్రభుత్వం పేద విద్యార్థుల పక్షాన ఆలోచన చేసి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిస్థాయిలో విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో.. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్క నాగేశ్వరరావు, బీసీ యువజన సంఘం జిల్లా కన్వీనర్ సిద్ధం రాజు, బీసీ యువజన సంఘం నియోజకవర్గ నాయకులు మునగాల శైలేందర్, బీసీ జేఏసీ పట్టణ నాయకులు దాసరాజు జయరాజ్, సైదా నాయక్, రవీందర్ నాయక్, రమేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.









