TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ
Srisailam : శ్రీశైలం కు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో 2.16 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!
కృష్ణానది ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయాలకు జలకళ సంతరించుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.

Srisailam : శ్రీశైలం కు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో 2.16 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
కృష్ణానది ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయాలకు జలకళ సంతరించుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తింది.
జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేయడం వల్ల శ్రీశైలం జలాశయానికి 2.16 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. దాంతో శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 101.50 టీఎంసీలకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులకు గాను ప్రస్తుతం 857.75 అడుగులకు నీరు చేరింది. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే వరద వచ్చే అవకాశం కనిపిస్తుంది.
Most Read
- WhatsApp : వాట్సప్ యూజర్లకు బిగ్ షాక్.. సస్పెండ్ అవుతున్న ఎకౌంట్లు.. ఎందుకంటే..!
- Miryalaguda : మూడు నెలలు గడిచినా లెక్చరర్లు లేరు.. విద్యార్థుల చదువులతో చెలగాటం..!
- Miryalaguda : అధికారులతో కుమ్మకై తప్పుడు సర్వే నంబర్లతో ప్లాట్లు విక్రయం.. విచారణ చేయాలని డిమాండ్..!
- Srisailam : శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద.. 855.10 అడుగులకు చేరిన నీరు.. లేటెస్ట్ అప్డేట్..!









