Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

Srisailam : శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద.. 855.10 అడుగులకు చేరిన నీరు.. లేటెస్ట్ అప్డేట్..!

కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టులో వరద నీరు భారీగా వచ్చే స్తుంది. ప్రస్తుతం వస్తున్న వరద నీరు మూడు, నాలుగు రోజులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Srisailam : శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద.. 855.10 అడుగులకు చేరిన నీరు.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టులో వరద నీరు భారీగా వచ్చే స్తుంది. ప్రస్తుతం వస్తున్న వరద నీరు మూడు, నాలుగు రోజులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండగా నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు నుంచి కూడా వీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం జలాశయం లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

శ్రీశైలం జలాశయ నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 855.10 అడుగులకు చేరింది.

* జూరాల ప్రాజెక్టు ట్రస్ట్ గేట్ల నుంచి 1,38 వేల క్యూసెక్కుల వరద నీరు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,184 క్యూసెక్కులు మొత్తం 1,71,154 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
* దాంతో శ్రీశైలం లోకి 1,49,917 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.
* ప్రస్తుతం 215 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టం గాను 92.24 టీఎంసీల నీరు ఉంది. కానీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా ఎలాంటి ఉత్పత్తి చేయడం లేదు.

* ఆల్మట్టి డ్యామ్ లోకి భారీగా వరద నీరు చేరుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి కృష్ణా నదిలోకి చేరుతుంది. ఆల్మట్టి డ్యామ్ లోకి 1, 25,515 క్యూసెక్కుల నీరు చేరుతుండగా గేట్లు ఎత్తడంతో పాటు విద్యుత్ కేంద్రాల ద్వారా 1,28,417 క్యూసెక్కుల నీటిని దిగివకు వదులుతున్నారు.
* అదేవిధంగా నారాయణపూర్ డ్యామ్ లోకి 1,28,954 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుండగా.. గేట్లు, విద్యుత్ కేంద్రాల ద్వారా 1,23, 64 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. అదే రీతిలో శ్రీశైలం ప్రాజెక్టులోకి నేటి ప్రవాహం కొనసాగుతుంది.

MOST READ 

మరిన్ని వార్తలు