Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. గేట్లు ఓపెన్ ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. శ్రీశైలం ఎగువ భాగంలో ఉన్న జలాశయాలు పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. గేట్లు ఓపెన్ ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. శ్రీశైలం ఎగువ భాగంలో ఉన్న జలాశయాలు పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆలమట్టి డ్యామ్ తో పాటు నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
జూరాల ప్రాజెక్టు నుంచి ఒక లక్ష డెబ్బై నాలుగు వేల 711 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశ నీటిమట్టం ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి గాను 846. 10 అడుగులు ఉంది. నీటి నిల్వ 72.1974 టీఎంసీల నీరు ఉంది. జలాశ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, కాగా 215 టీఎంసీలు. మరో వారం రోజులపాటు వరద ప్రవాహం కొనసాగితే శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి.
MOST READ
- Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. గేట్లు ఓపెన్ ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
- Srisailam : శ్రీశైలం జలశయానికి భారీ వరద ఉధృతి.. క్రస్ట్ గేట్లను తాకిన నీరు.. లేటెస్ట్ అప్డేట్..!
- కంకర రాళ్లకు బంగారం పూత పూసి మోసం..!
- Srisailam : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి.. ఇన్ ఫ్లో 79,403 క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!










