Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
రైతుల పొలాల్లో దొంగల హల్ చల్.. ఒక్క రాత్రిలో బోరు మోటార్ల కేబుల్ మాయం..!
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని చొక్కాండ్ల పల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో దొంగలు హల్ చల్ చేశారు.

రైతుల పొలాల్లో దొంగల హల్ చల్.. ఒక్క రాత్రిలో బోరు మోటార్ల కేబుల్ మాయం..!
(రామసముద్రం – వేణు)
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని చొక్కాండ్ల పల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో దొంగలు హల్ చల్ చేశారు. గురువారం అర్ధరాత్రి పొలాల్లోకి చొరబడిన దొంగలు బోరు మోటార్లు, కేబుల్ వైర్లు ఎత్తుకెళ్లారు.
ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు మోటార్లు కనిపించకపోవడంతో లబోదిబోమన్నారు. ఒక్కో బోరు మోటారు విలువ వేల రూపాయలు ఉండటంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది.
ఇటీవల పంచాయతీ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని, దొంగలను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.









