Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబ్‌నగర్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..!

నవాబ్‌పేట మండలం, కొల్లూరు గ్రామానికి చెందిన వడ్ల అభిలాష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అమ్మాపూర్, మొరంబాయ్ సమీపంలో శుక్రవారం ఈఘటన జరిగింది.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..!

(మహబూబ్ నగర్ జిల్లా – గోపాల్ )

నవాబ్‌పేట మండలం, కొల్లూరు గ్రామానికి చెందిన వడ్ల అభిలాష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అమ్మాపూర్, మొరంబాయ్ సమీపంలో శుక్రవారం ఈఘటన జరిగింది. వివరాల ప్రకారం.. నలుగురు సభ్యులు ఈ కుటుంబంలో తండ్రి 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు.

ప్రస్తుతం తల్లి, కూతురు, అభిలాష్‌తో కుటుంబం కొనసాగుతోంది. చేతికొచ్చిన కొడుకు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న వార్త విని తల్లి గుండె పగిలేలా రోదిస్తోంది. ఆ తల్లి ఆవేదన చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని ప్రజా సంఘాలు, గ్రామస్తులు కోరుతున్నారు ఈ ఘటన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు