Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్‌ శకం.. ఉత్తమ్ మీటింగ్ లోనే ఫ్లెక్సీ గొడవ..! 

తెలంగాణలో 2024లో మొదలైన కాంగ్రెస్‌ శకం 2034 వరకు కొనసాగుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్‌ శకం.. ఉత్తమ్ మీటింగ్ లోనే ఫ్లెక్సీ గొడవ..! 

సంక్షేమ పాలనతో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజాదరణ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐక్యంగా కదలాలని పార్టీ శ్రేణులకు పిలుపు

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా

(సూర్యాపేట – ముత్యంరాజు, మనసాక్షి)

తెలంగాణలో 2024లో మొదలైన కాంగ్రెస్‌ శకం 2034 వరకు కొనసాగుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని, వాటి ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు మద్దతు పెరుగుతోందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో మంత్రి ప్రసంగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అర్హులైన కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేయడం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ఒక మైలురాయి అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు నాణ్యమైన ఆహారాన్ని అందుబాటులోకి తెచ్చిన ఈ కార్యక్రమం, వారి ఆహార భద్రతను బలోపేతం చేయడంతోపాటు గౌరవప్రదమైన జీవనానికి తోడ్పడుతోందని వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆందోళనలు, సాగునీటి సవాళ్ల మధ్య కూడా రాష్ట్రంలో గణనీయమైన వరి ఉత్పత్తి నమోదైందని మంత్రి తెలిపారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, నీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్‌ సంస్థాగత బలాన్ని చాటుకునేందుకు ముఖ్యమైన అవకాశమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతూ ఎన్నికల సన్నాహాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డికి నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులు మద్దతునిచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : రైతుల పొలాల్లో దొంగల హల్ చల్.. ఒక్క రాత్రిలో బోరు మోటార్ల కేబుల్ మాయం..!

సమావేశంలో కాంగ్రెస్‌ ఎంపీలు కె. రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్‌. పద్మావతిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , టూరిజం మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, గ్రంధాలయం చైర్మన్ వి రామారావు, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఫ్లెక్సీ లో ఫోటో లేదని వేనారెడ్డి వర్గీయుల గోల

ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కొరకు సూర్యాపేట జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశం వేదిక పైన పెట్టిన ఫ్లెక్సీ లో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి ఫోటో ముద్రించ లేదు దీనితో వేనా రెడ్డి అభిమానులు మా నాయకుడి ని అవమాన పరిచ్చారని ఘర్షణ కు దిగారు. దింతో కొంత సేపు సమావేశం స్థలం లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల కార్యకర్తలు నెట్టుకోవడంతో పోలీసులు వారించారు. దింతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కల్పించుకొని సర్ది చెప్పడం తో సమావేశం సాపిగా జరిగింది.

మరిన్ని వార్తలు