వరి కోతల జోరు.. మరి కొనుగోలు కేంద్రాలు ఏవి..!
వరి కోతలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు.

వరి కోతల జోరు.. మరి కొనుగోలు కేంద్రాలు ఏవి..!
( కంగ్టి – జలీల్ )
వరి కోతలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు. కంగ్టి మండలంలో 3001 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారని వ్యవసాయ అధికారులు వెల్లడించారు. ఐకెపి ఆధ్వర్యంలో తడ్కల్, జమ్గి కే, జమ్గి బీ, ముర్కుంజాల్, ఘనపూర్, బాన్సువాడ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : రైతుల పొలాల్లో దొంగల హల్ చల్.. ఒక్క రాత్రిలో బోరు మోటార్ల కేబుల్ మాయం..!
కానీ ఇప్పటి వరకు ప్రారంభమే కాలేదు, ఇప్పటి వరకు 30% కోతలు పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ధాన్యం ఎక్కడికి తీసుకుపోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణంలో వస్తున్న మార్పులతో అకాల వర్షాలు పడితే ధాన్యం తడిసిపోతుందని, చేతికొచ్చిన వంట దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు ప్రారంభించకుంటే, దళారులకు అమ్ముకోవాల్సిందేనని దీంతో ఆర్థికంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు.









