Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : మూడు నెలలు గడిచినా లెక్చరర్లు లేరు.. విద్యార్థుల చదువులతో చెలగాటం..!

కళాశాలలు ప్రారంభమై మూడు నెలలు గడిచినా కూడా లెక్చరర్లు లేక విద్యార్థులు చదువులు సాగడం లేదు. అనేక సబ్జెక్టులకు అధ్యాపకులు లేక విద్యార్థులకు అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలకు నిలయంగా మారింది. 

Miryalaguda : మూడు నెలలు గడిచినా లెక్చరర్లు లేరు.. విద్యార్థుల చదువులతో చెలగాటం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

కళాశాలలు ప్రారంభమై మూడు నెలలు గడిచినా కూడా లెక్చరర్లు లేక విద్యార్థులు చదువులు సాగడం లేదు. అనేక సబ్జెక్టులకు అధ్యాపకులు లేక విద్యార్థులకు అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలకు నిలయంగా మారింది.

మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో రమణారెడ్డి కి వినతిపత్రం సమర్పించారు..

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్ మాట్లాడుతూ, పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్యకు ప్రధాన కేంద్రంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యా బోధన తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల ప్రారంభమై మూడు నెలలు గడిచినా అనేక సబ్జెక్టులకు లెక్చరర్లను నియమించలేదన్నారు.

బధిర విద్యార్థులకు అవసరమైన బోధనా సిబ్బంది లేకపోవడంతో పాటు, ఉర్దూ మీడియం విద్యార్థులకు సివిక్స్, ఎంపీహెచ్‌డబ్ల్యూ, పారామెడికల్, ఒకేషనల్ కోర్సులకు లెక్చరర్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధ్యాపకుల కొరత కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు..

విద్యాబోధన సమస్యలతో పాటు కళాశాలలో కనీస విద్యుత్, ఫ్యాన్ల వంటి మౌలిక వసతులు కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తీవ్ర ఉక్కపోత మధ్య విద్యార్థులు తరగతి గదుల్లో చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొనడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణమే కళాశాలను సందర్శించి వాస్తవాలను పరిశీలించి అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు మూడవత్ జగన్, వీరన్న, ఝాన్సీ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శివమణి, సంతోష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Most Read 

మరిన్ని వార్తలు