Miryalaguda : అధికారులతో కుమ్మకై తప్పుడు సర్వే నంబర్లతో ప్లాట్లు విక్రయం.. విచారణ చేయాలని డిమాండ్..!
అధికారులతో కుమ్మక్కై తప్పుడు సర్వేనెంబర్ లతో ప్లాట్లు విక్రయించారని మిర్యాలగూడ లోని తాళ్లగడ్డలోని వెంచర్ వద్ద బాధితులు ఆందోళన చేశారు.

Miryalaguda : అధికారులతో కుమ్మకై తప్పుడు సర్వే నంబర్లతో ప్లాట్లు విక్రయం.. విచారణ చేయాలని డిమాండ్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
అధికారులతో కుమ్మక్కై తప్పుడు సర్వేనెంబర్ లతో ప్లాట్లు విక్రయించారని మిర్యాలగూడ లోని తాళ్లగడ్డలోని వెంచర్ వద్ద బాధితులు ఆందోళన చేశారు. వెంచర్ వద్ద విజయ్, సతీష్ రెడ్డి, షైక్ ఇమాముద్దీన్, సంతోష్ యాదవ్, నరేష్ కుమార్ మాట్లాడుతూ..
రెవిన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్ అధికారులతో కుమ్ముకై కూనల కృష్ణ, చేకూరి సూర్యనారాయణ అనే వ్యక్తులు మిర్యాలగూడ పట్టణం, తాళ్లగడ్డ సర్వే నెంబర్ 118 లో పందిళ్లపల్లి పెద్ద చెరువును దాదాపు 10 ఎకరాలు కబ్జా చేశారని దానిని దాని పక్కనే ఆనుకొని వున్న సర్వే నెంబర్ 66 గా రిజిస్ట్రేషన్ చేశారాని ఆరోపించారు. వెంచర్ చేసి దాదాపు 105 ప్లాట్లు అమ్మడం జరిగిందన్నారు.
చెరువు భూమి కబ్జా చెయ్యడంతో వర్షాకాలంలో నీళ్లు మా ఇండ్లలోనికి, మా పొలాలలోనికి వచ్చి మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. ఈ విషయం తెలియని ఎందరో అమాయకులు ఇది పట్టా భూమి అని తెలియక కొన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇకనైనా మేలుకొని విచారణ చేసి చెరువు భూమిని స్వాధీన పరచుకోవాలని డిమాండ్ చేశారు.
MOST VIEWED :
- Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. గేట్లు ఓపెన్ ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
- Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. గేట్లు ఓపెన్ ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
- Nalgonda : నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మిర్యాలగూడ వాసి మృతి..!
- Good News : నిరుద్యోగులకు శుభవార్త.. అంగన్వాడి టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!









