Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి..!

నేటి సమాజంలో ఆర్థికంగా బలపడిన వారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు చందా రామమూర్తి అన్నారు.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి..!

కేతేపల్లి, మన సాక్షి :

నేటి సమాజంలో ఆర్థికంగా బలపడిన వారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు చందా రామమూర్తి అన్నారు. నార్కట్ పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో ఇటీవల దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యి రోడ్డున పడిన రంగా శ్రవణ్, కర్నాటి ఎల్లయ్య ల కుటుంబాలకు కేతేపల్లి మండల ఆర్యవైశ్య సంఘం తరఫున బుధవారం ఒక్కొక్కరికి 8 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ఆ కుటుంబాలను అన్ని రకాల వైశ్య సంఘాలు చేతనైనంత వరకు ఆదుకోవాలని సూచించారు. కేతేపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంపటి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం సహాయ కార్యదర్శి గుండా శరత్, నార్కట్ పల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బిళ్ళకంట శ్రీకాంత్,

గౌరవ అధ్యక్షుడు ఇరుకుల్ల బిక్షమయ్య, చెరువుగట్టు వైశ్య సత్రం అధ్యక్షుడు రంగా సీతయ్య, కేతేపల్లి మండల వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి బిక్షపతి, కోశాధికారి బొమ్మిడి చంద్రశేఖర్, మండల కమిటీ సభ్యులు చందా శ్రీనివాస్, ముప్పారపు సత్యనారాయణ, వాస రామమూర్తి, కందుకూరి నాగయ్య, దేవరశెట్టి నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు