Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

చందానగర్ లో యువకుడు అదృశ్యం..!

ఓ యువకుడు అదృశ్యమైన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది.

చందానగర్ లో యువకుడు అదృశ్యం..!

శేరిలింగంపల్లి, మన సాక్షి :

ఓ యువకుడు అదృశ్యమైన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్‌ 28న ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన దేవులపల్లి రామకృష్ణారెడ్డి (34) తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది బంధువులు, స్నేహితులు, తెలిసిన ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

రామకృష్ణారెడ్డి గత మూడేళ్లుగా చందానగర్ లోని పద్మజ కాలనీ, ఇంటి.నెం.63లో నివసిస్తూ పటాన్చెరులోని ఏపీఆర్‌ సంస్థలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా కార్యాలయంలో విచారించగా ఆరోజు రామకృష్ణారెడ్డి విధులకు హాజరు కాలేదని కుటుంబ సభ్యులకు తెలిసింది.

దీంతో వెంటనే చందానగర్ కు చేరుకున్న కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు, వివిధ ప్రాంతాల్లో వెతికారు. ఆయన రెండు సెల్‌ఫోన్‌ నంబర్లకు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వస్తుండటంతో కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన నెలకొంది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు