Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Miryalaguda : వాడపల్లిలో అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం..!

Miryalaguda : వాడపల్లిలో అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం..!

దామరచర్ల, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి గ్రామం నందు కలదు. సాక్షాత్తు అగస్త్య మహాముని ప్రతిష్టించారని శాసన ద్వారా తెలుస్తుంది. ఈ యొక్క వాడపల్లి పుణ్యక్షేత్రాన్ని జగద్గురువులు ఆదిశంకరాచార్యులు దర్శించి పూజించారని ప్రతీతి.

ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో దేవదాయ శాఖ మరియు స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానం వారు నవంబర్ 1న శుక్రవారం అమావాస్య రోజు స్వామివారి కళ్యాణం జరిపించుటకు నిశ్చయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపి రఘువీర్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంతటి గొప్ప కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులకు స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. కృష్ణ మూసి నదుల సంగమ తీరాన కొలువై ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి మరియు శ్రీ మీనాక్షి అగస్తీశ్వర స్వామి ఆలయాలను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం తీసుకుంటుందని తెలియజేశారు.

కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ పొదిళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతటి గొప్ప కార్యానికి విచ్చేసి తమ స్వ హస్తలతో లతో లక్ష్మీనరసింహుని కళ్యాణం జరిపించిన మంత్రి కుందూరు రఘువీర్ రెడ్డి దంపతులకు మరియు ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఇండియన్ సిమెంట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం కోసం పనిచేసిన కమిటీ సభ్యులకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పొదిల శ్రీనివాస్ , మాజి సర్పంచ్ కుందూటి మాదవి సిద్దయ్య, ఆలయ కమిటీ సభ్యులు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు, భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు