Special Officer : భూసేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలి.. ప్రత్యేక అధికారి ఆదేశం..!
Special Officer : భూసేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలి.. ప్రత్యేక అధికారి ఆదేశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాల భూసేకరణ పనులు, పునర్వస పనులు వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి. రవి నాయక్ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ విసి హాల్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎల్ ఐ స్కీం),రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ పనులలో భూసేకరణ పనులగురించి, ఇరిగేషన్, రెవిన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో సమీక్షించారు.
జిల్లాలోని ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అయ్యే విధంగా భూసేకరణ, ఇంకా మిగిలిన పెండింగ్ లో ఉన్న భూసేకరణ చేయాలన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు కృష్ణా నది ద్వారా జలాలను వినియోగించడం వల్ల జిల్లాలో సాగునీరు అవసరం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా నారాయణపేట కొడంగల్ ఎల్ ఐస్కీం ఎత్తిపోతల పథకాల భూ సేకరణ పనులపై చర్చించారు.
జిల్లాలో 21 గ్రామాలలో భూ సేకరణ జరగగా మక్తల్ లో 155.38, ఉట్కూర్ లో 234.16, నారాయణపేటలో 94.33, దామరగిద్దలో 76.35 ఎకరాల భూ సేకరణ ప్రోగ్రెస్ ఉందన్నారు. యల్. ఎ. ప్రొపొసల్స్ కానుకూర్తి ట్యాంక్ 1లక్ష ఎక్కర్స్ గ్రావిటీ కెనల్స్ కానుకుర్తి, దౌలతాబాద్, పనులలో ప్రాసెస్ అఫ్ ఇన్వెస్టిగేషన్ 1,500 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, సి.ఈ.రమణారెడ్డి ఎస్. ఈ.హచ్. టి.శ్రీధర్ ఈ. ఈ. బ్రహ్మం, ఈ. ఈ.ప్రతాప్ సింగ్,ఆర్. డి. ఓ. రాంచందర్, తహసీల్దార్ లు నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Seeds : నకిలీ విత్తనాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ టీం..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!
-
EY: పోటీ పరీక్షల్లో సరికొత్త అధ్యాయం.. పారదర్శకతే ధ్యేయంగా కీలక ముందడుగు..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికకు గడువు విధింపు..!
-
Ration Cards : రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. వచ్చిందా..? రాలేదా.? తెలుసుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి..!









