Breaking Newsజాతీయం

MF : వృద్ధికి స్థిరత్వాన్ని జోడించే లార్జ్, మిడ్-క్యాప్ ఫండ్‌ ఆవిష్కరణ..!

MF : వృద్ధికి స్థిరత్వాన్ని జోడించే లార్జ్, మిడ్-క్యాప్ ఫండ్‌ ఆవిష్కరణ..!

2025 జూన్ 05న ప్రారంభమై 2025 జూన్ 19న ముగియనున్న ఎన్ఎఫ్‌వో

• స్వంత C.A.R.E. మూమెంటమ్ వ్యూహంతో లార్జ్ & మిడ్ క్యాప్ కేటగిరీలో మూమెంటం వ్యూహాన్ని అమలుపర్చే ఏకైక ఫండ్

• రిస్కులకు తగ్గ రాబడులను అందించేందుకు భారత్‌లోని టాప్ 250 కంపెనీల్లో పెట్టుబడులు

ముంబై:

గత ఎనిమిది నెలలుగా గణనీయంగా కరెక్షన్‌కి లోనైన మార్కెట్లు క్రమంగా రికవరీ సంకేతాలు కనపరుస్తున్నాయి. మూమెంటం ఇన్వెస్టింగ్ వ్యూహాలను అమలు చేసేందుకు అనువైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శామ్‌కో అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (SAMCO Asset Management Private Limited) తమ శామ్‌కో లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్‌ను ఆవిష్కరించింది. స్థిరత్వం అందించే లార్జ్ క్యాప్ స్టాక్స్, వృద్ధి అవకాశాలు కల్పించే మిడ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడుల మేళవింపుతో ఈ ఫండ్ ఉంటుంది.

ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్‌వో) 2025 జూన్ 05న ప్రారంభమై 2025 జూన్ 19న ముగుస్తుంది. సంస్థకు చెందిన స్వంత C.A.R.E. మూమెంటం (క్రాస్ సెక్షనల్, అబ్జల్యూట్, రెవెన్యూ, ఎర్నింగ్స్ మూమెంటం) వ్యూహంతో ఇది పనిచేస్తుంది. ఈ కేటగిరీలో ఈ తరహా వ్యూహంతో పనిచేసే ఏకైక ఫండ్ ఇదే. ఈ ఎన్ఎఫ్‌వోలో ఇన్వెస్టర్లు ఏకమొత్తంగా కనీసం రూ. 5,000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. లేదా నెలకు రూ. 500 నుంచి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు (కనీసం 12 వాయిదాలు కట్టాలి). దీనికి నిఫ్టీ లార్జ్‌మిడ్‌క్యాప్ 250 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ (టీఆర్ఐ) బెంచ్‌మార్క్‌గా ఉంటుంది. Mrs. నిరాలీ భన్సాలీ, Mr. ఉమేశ్ కుమార్ మెహతా, Mr. ధవళ్ జి. ధనానీ దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తారు.

మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా టాప్ 250 కంపెనీల నుంచి ఎంపిక చేసిన సంస్థల స్టాక్స్‌తో ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియో వైవిధ్యంగా ఉంటుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగా లార్జ్ మరియు మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు కనీసం చెరో 35 శాతం పెట్టుబడులను కేటాయించేలా ఈ ఫండ్ ఉంటుంది.

“వైట్-బాల్ క్రికెట్‌లో– బ్యాటింగ్ యావరేజ్ మరియు స్ట్రైక్ రేట్ మేళవింపు అయిన ‘BASRA’ పదజాలం, ఒక ఆటగాడు చూపే ప్రభావాన్ని నిర్వచిస్తుంది. అలాగే, పెట్టుబడి విజయవంతం కావాలంటే స్థిరత్వం (యావరేజ్), మూమెంటం (స్ట్రైక్ రేట్) మధ్య సమతౌల్యత ఉండాలి. మా కొత్త ఫండ్ మధ్యేమార్గంగా, అచ్చంగా ఇదే మేళవింపుతో సుస్థిరమైన దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడే సాధనంగా ఉపయోగపడుతుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుంటూ, నిలకడగా ఫలితాలనిచ్చే విధంగా మా C.A.R.E. మూమెంటం స్ట్రాటెజీ రూపొందించబడింది” అని శామ్‌కో అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో విరాజ్ గాంధీ తెలిపారు.

MOST READ : 

  1. Aequs: కాన్ఫిడెన్షియల్ ప్రాతిపదికన ఐపీవో పత్రాలు దాఖలు చేసిన ఈక్వస్..!

  2. INDIE : బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్… అందుబాటులోకి ఆ యాప్..!

  3. Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  4. Sun Pharma : సొరియాసిస్ రోగులకు చేదు వార్త.. ఆ ట్రయల్స్ ఫెయిల్..!

  5. Rafel: భారత్‌లో రఫేల్ యుద్ధ విమానాల తయారీ.. టాటా భాగస్వామ్యం..!

మరిన్ని వార్తలు