Breaking Newsక్రైంహైదరాబాద్

Hyderabad : లారీ బీభత్సం.. ట్రాఫిక్ పోలీసుల పైకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి..!

Hyderabad : లారీ బీభత్సం.. ట్రాఫిక్ పోలీసుల పైకి దూసుకెళ్లిన లారీ, ఒకరి మృతి..!

మనసాక్షి, హైదరాబాద్ :

హైదరాబాదులోని మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ లో ఉన్న పోలీసుల మీదకి దూసుకొచ్చింది. దాంతో ముగ్గురి ట్రాఫిక్ పోలీసులకు గాయాలయ్యాయి. ఒక హోంగార్డు మృతి చెందారు.

వివరాల ప్రకారం.. కూకట్పల్లి నుంచి మియాపూర్ వైపు వెళ్తున్న లారీ పార్కింగ్ వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాఫిక్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ హోంగార్డు సింహాచలం మృతి చెందారు.

కానిస్టేబుల్ వీకేందర్, రాజవర్ధన్ చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ :

  1. Gold Price : మరోసారి కుప్పకూలిన బంగారం ధర.. తులం రూ.56 వేల దారిలో..!

  2. Axis Bank: యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. ఓటీపీ మోసాలకు ఇక చెక్..!

  3. Video : కామంతో కళ్ళు మూసుకుపోయి.. నడిరోడ్డుపై.. (వీడియో)

  4. Job Mela : పోలీసు శాఖ జాబ్ మేళాకు విశేష స్పందన.. 3033 మంది ఉద్యోగాలకు ఎంపిక.. నియామక పత్రాల అందజేత..!

మరిన్ని వార్తలు