Lawcet : లా సెట్ 2023 ఫలితాలు విడుదల

Lawcet : లా సెట్ 2023 ఫలితాలు విడుదల

మనసాక్షి , హైదరాబాద్ :

టీఎస్ లా సెట్ 2023 ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి 3. 30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. మే 25వ తేదీన తెలంగాణ లాసెట్ పరీక్ష నిర్వహించగా ఈ ప్రవేశ పరీక్షకు 43 ,692 మంది దరఖాస్తు చేసుకున్నారు.

 

36, 219 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో మూడు సంవత్సరాల ఎల్ఎల్ బి కోర్సుకు 25, 747 మంది ఉన్నారు. ఐదేళ్ల ఎల్.ఎల్.బి కోర్సుకు 8282 మంది, ఎల్ ఎల్ ఎం కోర్సు కు 2189 మంది హాజరయ్యారు.

 

లా సెట్ కౌన్సిలింగ్ విధానం :

 

> టీఎస్ లా సెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా కౌన్సిలింగ్ కోసం నమోదు చేసుకోవచ్చు.

> అభ్యర్థులు తమ డాక్యుమెంటను నిర్దేశించిన హెల్ప్ లైన్ సెంటర్లలో వెరిఫై చేయాలి.

> అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్ లైన్ మోడ్ ద్వారా కౌన్సిలింగ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

> జనరల్ కేటగిరి అభ్యర్థులకు 1000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయలు ఉంటుంది.

> అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీల కోసం వెబ్ ఆప్షన్లను పూరించాలి.

> టి.ఎస్.సి.హెచ్.ఇ యొక్క అధికారిక వెబ్ సైట్ నుండి ఎంపికలను పూరించవచ్చు.

> టీఎస్ లాసెట్ పరీక్షలో కళాశాల ఎంపిక , సీట్ల లభ్యత , సీట్లు కేటాయిస్తారు.

> సీట్ల కేటాయింపు ఫలితాలు అధికారిక వెబ్ సైట్ ప్రకటించబడతాయి.

> సీట్లు కేటాయించిన అభ్యర్థులు తప్పనిసరిగా పేర్కొన్న తేదీ, సమయంలో కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ALSO READ : GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !