Jai Congress : జై కాంగ్రెస్ అంటున్న మిర్యాలగూడ బీఆర్ఎస్ నేతలు.. ముఖ్య నేతల చేరికకు ముహూర్తం ఫిక్స్.!
Jai Congress : జై కాంగ్రెస్ అంటున్న మిర్యాలగూడ బీఆర్ఎస్ నేతలు.. ముఖ్య నేతల చేరికకు ముహూర్తం ఫిక్స్.!
మిర్యాలగూడ, మన సాక్షి :
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్త స్థాయి నుంచి పార్లమెంటు అభ్యర్థుల వరకు కూడా పార్టీలు మారుతున్నారు. బీఆర్ఎస్, బిజెపిల నుంచి ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తామని చెప్పి ఎమ్మెల్యేలను సైతం పార్టీలో చేర్చుకుంటున్నారు. కానీ విచిత్రం ఏంటంటే మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి రావద్దు.. అంటూ తీర్మానం చేశారు.
అయినా పార్టీ ఎవరి సొంతం కాదు. పార్టీలోకి నాయకులు వస్తుంటారు.. వెళ్తుంటారు.. వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పార్టీలు మారుతుంటారు. అలాంటివారు ఏ పార్టీలోనైనా ఉంటారు. కాగా ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు కూడా ముఖ్యం అయ్యాయి. ఎన్నికల సమయంలో పార్టీలు మారడం సర్వసాధారణం అయిన విషయమే.
మిర్యాలగూడ నియోజకవర్గానికి చిరకాల పరిచయం ఉన్న మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అందుకు జానారెడ్డి తో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు కూడా రఘువీర్ రెడ్డిని గెలిపించేందుకు కంకణం కట్టుకున్నారు. అందుకు పార్టీలకు అతీతంగా కూడా ఆయనను గెలిపించేందుకు సిద్ధమయ్యారు. అందుకు గాను బీఆర్ఎస్ నేతలు పలువురు రాజీనామాలు సైతం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాకపోయినప్పటికీ రఘువీర్ రెడ్డి విజయం కోసం కృషి చేస్తామని ప్రకటించారు.
ముఖ్య నేతల చేరికకు ముహూర్తం ఫిక్స్ :
బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రధాన నేతలు సిద్ధమయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్య నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేసిన తీర్మానాలను పక్కకు పెట్టి ఏకంగా కాబోయే ఎంపీ సమక్షంలోనే పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
అందుకుగాను జానారెడ్డి , ఉత్తంకుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వారిని చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం ముగిసిన అనంతరమే మిర్యాలగూడ నియోజకవర్గంలో భారీగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు వచ్చే అవకాశం ఉంది. నామినేషన్ కార్యక్రమం ముగిసిన అనంతరం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. అందుకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు నేతలు కూడా సిద్ధమయ్యారు.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి :
BREAKING : బీఆర్ఎస్ లో కొనసాగుతున్న రాజీనామాలు.. మిర్యాలగూడలో మరో సీనియర్ నేత రాజీనామా..!
Telangana : మిర్యాలగూడ నుంచే కేసీఆర్ రోడ్ షో.. షెడ్యూల్ ఇదే..!
BIG BREAKING : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. రేవంత్ తో భేటీ అయిన మరో ఎమ్మెల్యే..!
KTR : కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతుంది.. హామీల అమలుపై కేటీఆర్ ఘాటుగా ట్వీట్..!
Aadhaar : మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చలేదా..? అయితే ఇలా మార్చేయండి..!










