Breaking Newsతెలంగాణహైదరాబాద్

Elections : తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఇది షెడ్యూల్..!

Elections : తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఇది షెడ్యూల్..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నాగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను ఫిబ్రవరి 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానున్నది.

తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. మెదక్ , నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గం పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి (కాంగ్రెస్) కొనసాగుతున్నారు.

అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానంలో ప్రస్తుతం అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. అదే విధంగా మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా కూర రఘోత్తమ్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ స్థానం ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీల పదవి కాలం మార్చి 29వ తేదీతో ముగియనున్నందున ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లాలలో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నది.

ఎన్నికల షెడ్యూల్ ఇదీ..!

  • నోటిఫికేషన్ విడుదల – ఫిబ్రవరి 3

  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ – ఫిబ్రవరి 10

  • నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 11

  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ – ఫిబ్రవరి 13

  • పోలింగ్ – ఫిబ్రవరి 27 (ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

  • ఓట్ల లెక్కింపు – మార్చి 3

MOST READ :

మరిన్ని వార్తలు