సూర్యాపేట : గ్రంథాలయంలో నిరుద్యోగుల ఆకలి తీర్చిన మంత్రి

సూర్యాపేట : గ్రంథాలయంలో నిరుద్యోగుల ఆకలి తీర్చిన మంత్రి

సూర్యాపేట , మనసాక్షి

ఇటీవల జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువతీ యువకుల తో మాట్లాడిన మంత్రి జగదీశ్ రెడ్డి దృష్టికి అక్కడి యువతీ, యువకులు అదనపు నిర్మాణం అవసరాన్ని తీసుకువచ్చారు.

 

వెంటనే స్పందించిన మంత్రి యుద్ద ప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్దం చేసి హామీ ఇచ్చిన రెండు రోజులకే లైబ్రరీ లో అదనపు సీటింగ్ కొసం కావాల్సిన షెడ్ నిర్మాణం కు గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. మూడు రోజుల్లో నిర్మాణము పూర్తి చేసి అందుబాటులో కి తేవాలని ఆదేశించారు.

 

అడగకుండానే ఆకలి భాద తీర్చిన మంత్రి : 

ప్రస్తుతం కాంపిటీటివ్ పరీక్షల సీజన్ నడుస్తుండటం తో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న గ్రంధాలయం యువతీ, యువకులతో నిండిపోతుంది. అన్ని వసతులు బాగానే ఉన్న పోటీ పరీక్షల కు ప్రిపేర్ అయ్యే వారికి మధ్యాహ్న భోజనం ఆటంకంగా మారింది.

 

విద్యార్దుల సమస్యను అర్దం చేసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి యువతీ ,యువకుల కోసం బోజన వసతి ఏర్పాటు చేయడం తో పాటు శుక్రవారం నుండి భోజన సౌకర్యం ను తనే ప్రారంభించి అందుబాటు లోకి తీసుకువచ్చారు. గ్రంథాలయం నందు భోజన సౌకర్యం కల్పించిన మంత్రికి ధన్యవాదములు తెలిపారు.

 

ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వీ, పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, కౌన్సిలర్లు తాహెర్ పాషా, నిమ్మల స్రవంతి, రాపర్తి శ్రీనివాస్, అనoతుల యాదగిరి, మద్ధి శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.