Gunde Ninda Gudigantalu : ఇలా రా.. తలుపు వేయి.. రోహిణి గొంతు పట్టిన ప్రభావతి.. (ఎపిసోడ్ 16 జూన్)
Gunde Ninda Gudigantalu : ఇలా రా.. తలుపు వేయి.. రోహిణి గొంతు పట్టిన ప్రభావతి.. (ఎపిసోడ్ 16 జూన్)
మన సాక్షి :
గుండె నిండా గుడిగంటలు సీరియల్ మాటీవీలో తెలుగువారిని ఎంతో ఆకట్టుకుంటుంది. సీరియల్ లో నటిస్తున్న ప్రభావతి, బాలు మధ్య సంభాషణ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. అయితే శనివారం ఎపిసోడ్ లో రోహిణి పార్లర్ పేరు మార్చిన విషయం ఆమె భర్త మనోజ్ గుర్తించి ఇంట్లో చెప్తాడు. ఈ విషయంపై ప్రభావతి మిన్న కుండా ఉంటుంది. ఈ సంఘటన చూసి బాలు, మీనా, సత్యం కూడా ఆశ్చర్యపోతారు.
సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందంటే రూమ్ లోకి వెళ్లిన ప్రభావతి రోహిణి ని ఇలా రా.. తలుపు వేయి అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. తనకు తెలియకుండా పార్లర్ పేరు ఎలా మార్చావంటూ సీరియస్ అవుతుంది. ఇదైనా ఇంకేదైనా ఉందా.. నువ్వు పార్లర్ ఎలా పెట్టుకున్నావో తెలుసా.
ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నీకు పార్లర్ పెట్టించిన.. ఆ విషయంపై వడ్డీ వ్యాపారి కూడా నిలబెట్టాడు. ఇంట్లో కూడా బాలు బోనులో నిలబెట్టాడు. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నేను లేకుండా నువ్వు ఇంట్లో కూడా ఉండలేవువవ అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. దాంతో రోహిణి కంట నీళ్లు వస్తాయి. ఈ విషయానికే ఇంత రాద్ధాంతం చేస్తున్న ప్రభావతి పెళ్లైన విషయం, తనకు కొడుకు ఉన్న విషయం తెలిస్తే ఎలా ఉంటుందో అని మనసులో అనుకుంటుంది.
ఇది ఇలా ఉండగా బాలు కోసం అతని భార్య మీనా కారు కొనుగోలు చేయడానికి స్నేహితులతో కలిసి ట్రాయల్ బాలు తోనే వేయిస్తుంది. అతను కూడా నచ్చడంతో అదే కారు అతనికి తెలియకుండానే కొనుగోలు చేస్తుంది. ఇంట్లో గుడికి వెళ్దామని తీసుకెళ్లిన బాలుని గుడి దగ్గర సర్ప్రై జ్ చేసి కారు కొనిస్తుంది.
గుడి దగ్గరికి మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి తో పాటు స్నేహితులను కూడా పిలుస్తుంది. సర్ ప్రైజ్ గిఫ్ట్ గా ఇస్తుంది. బాలు కు అతని చెల్లెలు ఫోన్ చేయగా తన భార్య మీనా ఎంతో ఓర్పు ఉందని చెప్పడంతో మీనా ఆనంద భాష్పాలు వస్తాయి. అది మంగళవారం ఎపిసోడ్ లో చూడొచ్చు.
MOST READ :
-
Nalgonda : నల్గొండ లో.. పుష్ప ఫేమ్ జగదీష్..!
-
Alumni : 34 సంవత్సరాల తర్వాత అందరు ఒకేచోట..!
-
Miryalaguda : నీట్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయ స్థాయి ర్యాంకులు..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు.. డేట్ ఫిక్స్.. ఆ రోజు పండుగే.. బిగ్ అప్డేట్..!
-
District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. రైతు నేస్తం వీక్షించాలి..!









