Cm Revanth Reddy : అందరికీ రుణమాఫీ.. ఎవరి మాటలు నమ్మొద్దు.. విడుదల అప్పుడే.. రేవంత్ కీలక ప్రకటన..!
Cm Revanth Reddy : అందరికీ రుణమాఫీ.. ఎవరి మాటలు నమ్మొద్దు.. విడుదల అప్పుడే.. రేవంత్ కీలక ప్రకటన..!
మన సాక్షి, వరంగల్ :
తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. వరంగల్ విజయోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీని చేశామని చెప్పారు.
చిన్నచిన్న కారణాలతో కొంతమందికి రుణమాఫీ కాలేదన్నారు. కానీ ఎవరు అధైర్య పడవద్దు అని ఎవరి మాటలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు.
సాంకేతిక కారణాలు, రేషన్ కార్డు లేకపోవడం వల్ల పలువురి రైతులకు రుణమాఫీ చెందని విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరించి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు.
కాగా సుమారు ఐదు లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా గుర్తించారు. కాగా ఇటీవల 5వేల కోట్ల రూపాయలను రుణమాఫీ కోసం విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేసింది. దాంతో వరంగల్ సభలో రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు త్వరలో రుణమాఫీ నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది.
MOST READ :









