Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయం

LPG : గ్యాస్ పై కేంద్రం గుడ్ న్యూస్.. రాష్ట్రాలకు లేఖలు..!

పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత కనిపిస్తుంది. గృహ అవసరాలకు ప్రజలు ఇబ్బంది పడుతుండగా, వాణిజ్య వినియోగదారులు సైతం గ్యాస్ కొరతతో సతమౌతమవుతున్నారు. దాంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

LPG : గ్యాస్ పై కేంద్రం గుడ్ న్యూస్.. రాష్ట్రాలకు లేఖలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత కనిపిస్తుంది. గృహ అవసరాలకు ప్రజలు ఇబ్బంది పడుతుండగా, వాణిజ్య వినియోగదారులు సైతం గ్యాస్ కొరతతో సతమౌతమవుతున్నారు. దాంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఎల్పిజి గ్యాస్ పై మరో కీలక నిర్ణయం తీసుకుంది. దానిని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి గాను రాష్ట్రాలకు లేఖలు సైతం పంపింది. పెట్రోలియం, సహజ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శిలకు లేఖ రాశారు.

పరిశ్రమలకు ప్రస్తుతం సరఫరా చేస్తున్న 50% ఎల్పిజి కమర్షియల్ గ్యాస్ ను కేటాయింపులకు అదనంగా మరో 20 శాతం కూడా ఇవ్వాలని సూచించారు. దానిలో మొత్తం వాణిజ్య ఎల్పిజి కేటాయింపులు సంక్షవానికి ముందున్న ప్రకారం నాన్ డొమెస్టిక్ ఎల్పిజి స్థాయిలో 70 శాతానికి చేరుతుందన్నారు. సహజ వాయువుతో ప్రత్యామ్నాయం లేని ప్రత్యేక ప్రజా అవసరాల ప్రయోజనాల కోసం వినియోగించే పరిశ్రమలకు ఎల్పీజీ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దాంతో రాష్ట్రంలోని పారిశ్రామిక కార్యకలాపాలకు కమర్షియల్ గ్యాస్ మరింత అందనున్నది. దాంతో కొంతమేర ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు