Lucky Draw : రూ. 100 కట్టు.. లక్ష కొట్టు.. అంటూ ప్రచారం..!
Lucky Draw : రూ. 100 కట్టు.. లక్ష కొట్టు.. అంటూ ప్రచారం..!
అలంపూర్ , మన సాక్షి :
లక్కీ డ్రా ల పేరుతో ఇంకా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి జోగులాంబ గద్వాల జిల్లా బొంకూరు గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం .. వంద రూపాయలు కట్టండి లక్ష రూపాయలు కొట్టండి. అంటూ లక్కిడిప్ పేరుతో మోసాలకు పాల్పడ్డారు ఓ ఇద్దరు వ్యక్తులు. ప్రతిరోజు కూలికి వెళ్లి పనులు చేసుకునే వారి నుంచి 1200 మందికి పైగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. దీనిని గుర్తించిన గ్రామస్తులు ఎదురు తిరగడంతో తిరిగి ఎవరి డబ్బులు వాళ్లకు చెల్లించిన నిర్వాహకులు.
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలోని బొంకూరు గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి లక్కిడిప్ పేరుతో రసీదులు ముద్రించి ఆ ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాలను సందర్శించారు.
ALSO READ :
1. Road Accident : రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం.. అంతా ఓకే కుటుంబానికి చెందినవారు..!
2. BIG BREAKING : వేములపల్లి : అదుపుతప్పి ఆటో బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు..!
3. WhatsApp : వాట్సాప్ సరి కొత్త ఫీచర్.. ఇక ఆ భయం అవసరమే లేదు..!
5. Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
ఆయా గ్రామాలలో ఒక్కొక్క వ్యక్తి వంద రూపాయలు చెల్లిస్తే లక్కి లాటరీలో వెళ్తే లక్ష రూపాయలు ఇస్తామంటూ నెల రోజుల క్రితం నుంచి ప్రచారం చేశారు. 100 రూపాయలే కదా వస్తే లక్ష రూపాయలు వస్తాయని చాలామంది ఆసక్తి చూపి చెల్లించారు. 1200 మందికి పైగా లక్కీ డ్రా టికెట్లు కొనుగోలు చేశారు. ఆగస్టు 30వ తేదీన లక్కీ డ్రా ఉంటుందని చెప్పారు.
చెప్పిన విధంగా బొంకూర్ గ్రామంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఓపెన్ చేయగా 9730 అనే టికెట్ వినియోగదారుడికి లక్ష రూపాయలు తగిలినట్లు వచ్చింది. కాగా ఆ నెంబర్ పేరున వంద రూపాయలు ఎవరు చెల్లించారో తెలుసుకోవాలని ఆ గ్రామస్తులు ఆరా తీశారు. కాగా ఆ నెంబర్ పేరున ఎవరూ లేకపోవడం ఆశ్చర్యకరం.
అనుమానం వచ్చిన గ్రామస్తులు ఎవరికి డ్రా వచ్చిందో చెప్పాలని నిలదీశారు. అంతేకాకుండా డ్రాలో వేసిన నెంబర్లలో వారి నెంబర్స్ ఉన్నాయా..? లేవా..? అని తనిఖీ చేశారు. దాంతో అమ్ముడుపోని నెంబర్లు పెట్టినట్లు గమనించి వారిని గట్టిగా నిలదీశారు. దీంతో చేసేదేమీ లేక నిర్వాహకులు ఎవరి వంద వాళ్లకే చెల్లిస్తామని ప్రాధేయపడటంతో రాజీ కుదిరినట్లు సమాచారం.









