WhatsApp : వాట్సాప్ సరి కొత్త ఫీచర్.. ఇక ఆ భయం అవసరమే లేదు..!
WhatsApp : వాట్సాప్ సరి కొత్త ఫీచర్.. ఇక ఆ భయం అవసరమే లేదు..!
మనసాక్షి , వెబ్ డెస్క్:
వాట్సాప్ యూజర్ల కోసం ఆ సంస్థ అనేక ఫీచర్లను తీసుకొస్తుంది. కొత్త కొత్త ఫీచర్లతో వాట్స్అప్ యూజర్లను ఆకట్టుకుంటుంది. దాంతో వాట్సప్ యూజర్ల సంఖ్య రోజుకు మరింతగా పెరుగుతుంది. ప్రస్తుతం మరో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నది . ఈ కొత్త ఫీచర్ .. కాల్స్ సమయంలో గోప్యత, రిలే ఫీచర్ మాదిరిగా పనిచేస్తుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
ఇటీవల సోషల్ మీడియాలో సైబర్ మోసగాళ్లు పెరుగుతున్నారు. సోషల్ మీడియా ద్వారా వలవేసి నిండా ముంచుతున్నారు. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు వాట్స్అప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ ఇటీవల కాలంలో వాట్స్అప్ ద్వారా మోసపోయే అమాయకుల సంఖ్య కూడా పెరుగుతుంది దాంతో వాట్సప్ వాడాలంటేనే కొంతమంది భయపడుతున్నారు. ఈ సందర్భంలో ఆ సంస్థ అప్రమత్తమైంది. వాట్సాప్ యూజర్లకు భద్రత కల్పించడం పై దృష్టి సారించింది. అందువల్ల సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకురానున్నది.
WABetalnfo లేటెస్ట్ డేటా ప్రకారం ప్రొటెక్ట్ ఐపి అడ్రస్ ఇన్ కాల్స్ (Protect lp address in calls) అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకు రావడం పై వాట్సాప్ యాజమాన్యం పనిచేస్తుంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సప్ కాల్ సమయంలో యూజర్లు ఐపి అడ్రస్ వ్యక్తిగత వివరాలను తెలుసుకునేందుకు.. వేరే వ్యక్తులకు కష్టతరం అవుతుంది. సైబర్ నేరగాళ్లు వాట్స్అప్ కాల్స్ మాట్లాడుకునే సమయంలో వినియోగదారుల లొకేషను ట్రాక్ చేస్తున్నారు. దీంతో వారి ఆటలను కట్టించేందుకు వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ సర్వర్ల ద్వారా కాల్స్ మాట్లాడే వ్యక్తుల లొకేషన్ ను కూడా గుర్తించడం కష్టతరం చేస్తుంది.
ALSO READ :
- TSRTC : ఆ రెండు రోజుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు టి ఎస్ ఆర్ టి సి శుభవార్త.. రూ. 5.5 0 లక్షల బహుమతులు..!
- Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
- Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
- Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
వినియోగదారుడు కాల్ చేసినప్పుడు వారి ఫోన్ వాట్సాప్ సర్వర్లకు కనెక్ట్ అవుతుంది. వాట్సాప్ సర్వర్లు కాల్ ఎన్క్రిప్ట్ చేసి అవతలి వ్యక్తి ఫోన్ కి రూట్ చేస్తాయి. కాగా అవతలి వ్యక్తి ఫోన్ కాల్ ను డీ క్రిప్ట్ చేసి వినియోగదారుడికి కాల్ కనెక్ట్ చేస్తుంది . ఆ కాల్ వాట్సాప్ సర్వర్లకు కనెక్ట్ చేసినట్లు మాత్రమే ఇతరులు చూడగలుగుతారు. వినియోగదారుల ఐపి అడ్రస్ లొకేషన్ ను చూడలేరు. దీంతో వినియోగదారుల లోకేషన్ ట్రాక్ చేయడం కష్టతరంగా కానున్నది.
అయితే ఈ ఫీచర్ వినియోగదారులకు అదనపు భద్రత అందించి కాల్ స్పష్టంగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
అదేవిధంగా వాట్సాప్ సెట్టింగ్ లతో “సైలెన్స్ అనోన్ కలర్స్” అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మెటా తన అధికారికంగా బ్లాక్ పోస్టులో నూతన ఫీచర్లను ప్రకటిస్తూ సైలెన్స్ అండ్ అనోన్ కాలర్స్ వాట్సప్ వినియోగదారులకు మరింత గోప్యతను, ఇన్ కమింగ్ కాల్స్ పై నియంత్రణ ఉంచుతున్నట్లు తెలియజేసింది. ఈ ఫీచర్ స్పామ్ , స్కామ్ లు, తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వస్తే స్క్రీన్ పై చూపిస్తుంది.
ఈ ఫీచర్ ద్వారా గోప్యత, నియంత్రణ కోసం వాట్సాప్ లో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఇన్కమింగ్ కాల్స్ ను మ్యూట్ చేసే అవకాశం ఉంది. ఒకసారి మ్యూట్ చేస్తే తెలియని నెంబర్ ల నుంచి వచ్చే కాల్స్ ను ఆటోమేటిక్ గా మ్యూట్ చేస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన, కావాల్సినవి కోల్పోకుండా ఉండేందుకు కాల్ లిస్టులో నోటిఫికేషన్ హిస్టరీలో ఉంటుంది.
ALSO READ :
- Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
- Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!
- NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?
- Jana Reddy : జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? మరి సాగర్ నుంచి ఎవరు పోటీ..?











