Jana Reddy : జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? మరి సాగర్ నుంచి ఎవరు పోటీ..?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయ చతురుడు కుందూరు జానారెడ్డి 2023 ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? ఇది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో టికెట్లు కావాలనుకునే వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. కానీ జానారెడ్డి ఇప్పటివరకు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నుంచి ఆయన దరఖాస్తు చేయలేదని సమాచారం.

Jana Reddy : జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? మరి సాగర్ నుంచి ఎవరు పోటీ..?

హైదరాబాద్, మనసాక్షి :

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయ చతురుడు కుందూరు జానారెడ్డి 2023 ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? ఇది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో టికెట్లు కావాలనుకునే వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. కానీ జానారెడ్డి ఇప్పటివరకు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నుంచి ఆయన దరఖాస్తు చేయలేదని సమాచారం. ఆయన స్థానంలో జానారెడ్డి చిన్న కుమారుడు కుందూరు జై వీర్ రెడ్డి దరఖాస్తు చేసుకోవడం విశేషం .

 

ఈసారి ఎన్నికలకు జానారెడ్డి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా..? ఆయన స్థానంలో తన చిన్న కుమారుడిని పోటీలో నిలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారా..? లేదా చివరి రోజు శ్రావణ శుక్రవారం దరఖాస్తు చేయనున్నారా.? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

 

ALSO READ : 

  1. నల్లగొండ  : సింగిల్ ఇన్వెస్ట్.. డబుల్ ప్రాఫిట్, రియల్ వ్యాపారం మాటున ఘరానా మోసం..!
  2. మిర్యాలగూడ : ఓ ఇనుపరాడ్డు.. మూడు అడుగుల కర్ర, టంగ్ క్లీనర్స్.. వారి ఆయుధాలు..!
  3. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
  4. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  5. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తాం

 

నాగార్జునసాగర్ నియోజకవర్గ నుంచి చిన్న కుమారుడు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా పెద్ద కుమారుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని విషయం తెలియాల్సి ఉంది. పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి మొదటినుంచి మిర్యాలగూడ నియోజకవర్గం పై దృష్టి సారించారు. గత ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో రఘువీర్ రెడ్డి సైతం ఉన్నారు. ఊహించని పరిణామాల వల్ల ఆర్ కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో రఘువీర్ రెడ్డి సైతం మెల్లకున్నారు.

 

కాగా ఈసారి నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది.  ఇది ఇలా ఉండగా నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ కు
బీఆర్ఎస్ మరోసారి టికెట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం దరఖాస్తులు గడువు శుక్రవారంతో ముగియనున్నది. మరొక్క రోజే దరఖాస్తులకు అవకాశం ఉండటం వల్ల భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు భావిస్తున్నాయి. దరఖాస్తుల గడువు ముగిసిన అనంతరం పరిశీలించి సర్వేలు నిర్వహించి అభ్యర్థులను ప్రకటించనున్నట్లు గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.