ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తాం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలిచి అధికారం చేపట్టబోతుందని నల్గొండ పార్లమెంట్ సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తాం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలిచి అధికారం

నల్గొండ పార్లమెంట్స్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట , మనసాక్షి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలిచి అధికారం చేపట్టబోతుందని నల్గొండ పార్లమెంట్ సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోపిడీకి అలవాటు పడి సాధారణ ప్రజలను హింసిస్తున్నారని అన్నారు.కోదాడ, హుజూర్నగర్ ఎమ్మెల్యేల దోపిడీ వికృతి చేష్టలకు ప్రజలు విసిగిపోయారని వాళ్లని ఇంటికి పంపడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు.

 

కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేయడానికి నేను నా సతీమణి, కోదాడ హుజూర్నగర్ లో మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లకు 12 క్లీన్ సిప్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 70 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టబోతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కి మూడెకరాల భూమి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని ఇంతవరకు ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసం అన్నారు.

 

ALSO READ : 

  1. TELANGANA :  బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్
  2. TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!
  3. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  4. Anusuya : వెక్కి వెక్కి ఏడ్చుతున్న యాంకర్ అనసూయ.. వీడియో వైరల్..!
  5. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!

 

టిఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు దోపిడీదారులకు కేసిఆర్ వత్తాసుదారులకు మాత్రమే సీట్లు ప్రకటించారని, అది కాంగ్రెస్ పార్టీకి అధికారం లోకి రావడానికి ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం నడుస్తుందని అది ఒక్కసారిగా ఆకాశానికి ఉవ్వెత్తిన ఎగిసిపడి, ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ గ్లోబల్ ప్రచారం మీద అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలుసుకోవాలన్నారు.

 

కోదాడ ముదిగొండ గ్రామంలో దళిత బందులో జరిగిన అక్రమాల పై ఆధారాలతో నిరూపిస్తే ఏ ఒక్కరి పైన కూడా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ శాసనసభ్యురాలు ఉత్తం పద్మావతి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, కౌన్సిలర్లు కక్కిరేని శ్రీనివాస్, వేములకొండ పద్మ, కాంగ్రెస్ నాయకులు చింతమళ్ళరమేష్, ఆలేటి మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.