మిర్యాలగూడ : ఓ ఇనుపరాడ్డు.. మూడు అడుగుల కర్ర, టంగ్ క్లీనర్స్.. వారి ఆయుధాలు..!

అంతరాష్ట్ర ముఠాకు చెక్.. బంగారం చోరీ చేసి.. ముత్తూట్‌లో పెట్టి , ఒక్క నల్లగొండ జిల్లాలోనే 20 చోరీ కేసులు, బైపాస్ వెంట ఉన్న ఇండ్లే వారి టార్గెట్, రూ.60 లక్షల సొమ్ము రికవరీ..

మిర్యాలగూడ : ఓ ఇనుపరాడ్డు.. మూడు అడుగుల కర్ర, టంగ్ క్లీనర్స్.. వారి ఆయుధాలు..!

అంతరాష్ట్ర ముఠా అరెస్ట్..

అంతరాష్ట్ర ముఠాకు చెక్..

బంగారం చోరీ చేసి.. ముత్తూట్‌లో పెట్టి ,

ఒక్క నల్లగొండ జిల్లాలోనే 20 చోరీ కేసులు,

బైపాస్ వెంట ఉన్న ఇండ్లే వారి టార్గెట్,

రూ.60 లక్షల సొమ్ము రికవరీ..

నల్లగొండ పోలీసు టీమ్ కృషి భేష్. అభినందించిన ఎస్పీ కె. అపూర్వరావు

నల్లగొండ, మన సాక్షి:

వారంతా అంతరాష్ట్ర ముఠా దొంగలు.. కానీ వారిది విలాసవంతమైన జీవితం, నిత్యం కారులో తిరగడం.. హైఫై లైఫ్ గడపడం వారి హాబీ.. హైవేల వెంట ఉన్న ఇండ్లే వారి టార్గెట్.. ఓ ఇనుపరాడ్డు.. మూడు అడుగుల కర్ర.. టంగ్ క్లీనర్స్. చేతికి వేసుకునే గ్లాసులు.. తలకు పెట్టుకునే టోపి.. ఇవే వారి ఆయుధాలు.. అంతే గంటల వ్యవధిలోనే వారి పని కంప్లీట్ అవుతుంది.. ఎలాంటి ఇల్లైనా సరే.. క్షణాల్లో గుళ్లు కావాల్సిందే.. బంగారవెండి అభరణాలు.. నగదు.. ఇలా వారికేది అతీతం కాదు.

 

ఇలాంటి కరుడుగట్టిన ముఠాకు నల్లగొండ జిల్లా పోలీసు టీమ్ చెక్ పెట్టింది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 20కి పైగా ఇండ్లల్లో చోరీ చేశారు. రూ.లక్షల విలువైన సొమ్మును కొల్లగొట్టారు. తీరా నల్లగొండ జిల్లా పోలీసు టీమ్ కు అడ్డంగా దొరికేశారు.

 

RELATED NEWS : 

 1. మిర్యాలగూడ : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
 2. Cooking : హోటల్లో వంట మాస్టర్ కానీ.. స్నేహితులతో కలిసి..!
 3. BREAKING : వేములపల్లి మండలంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. మహిళ మృతి..!
 4. మూడేళ్ల కుమారుడు కు విషం ఇచ్చి.. ఆత్మహత్యాయత్నం కు పాల్పడ్డ తల్లి..!
 5. Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!

 

జల్సాలకు అలవాటు పడి :

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసారావుపేట ఎన్టీఓ కాలనీకి చెందిన జంగా వెంకట్రావు (32) అదే జిల్లా రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన దమ్ము సుధాకర్ (29) వృత్తిరీత్యా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కానీ చిన్నతనం నుంచి వీరు జల్సాలకు అలావాటు పడి ఏ పని సరిగ్గా చేసేటోళ్లు కాదు, ఏలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో 2011లో నరసరావుపేటలో దొంగతనం చేసి జైలుపాలయ్యారు.

 

బయటికొచ్చాక.. టీ స్టాల్ నడిపినా ప్రయోజనం లేకపోవడంతో మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టారు, అయితే పల్నాడులో దొంగతనాలు చేస్తే.. దొరికిపోతామనే ఉద్దేశంతో మిర్యాలగూడకు మకాం మార్చారు. మిర్యాలగూడలోని బైపాస్ వెంట ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రివేళలో తమ పనికానిచ్చేవారు.

 

MOST READ : 

 1. మిర్యాలగూడ : ఏటీఎంలు చోరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి అరెస్టు..!
 2. BIG BREAKING : వేములపల్లి : అదుపుతప్పి బైక్ ను ఢీ కొట్టిన బస్సు.. ఇద్దరు దుర్మరణం..!
 3. TELANGANA :  బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్
 4. దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!
 5. కుల్కచర్ల లో నకిలీ అల్లం , వెల్లుల్లి పేస్ట్ పట్టివేత..!
 6. BRS : బిఆర్ఎస్ లో మొదలైన టికెట్ల లొల్లి
 7. మిర్యాలగూడ : ఏటీఎంలు చోరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి అరెస్టు..!

 

టంగ్ క్లీనర్ టవర్ బోల్ట్ తొలగించి :

మొదటగా ఎంపిక చేసుకుని ఇండ్లలోకి అర్ధరాత్రి సమయంలో ప్రవేశించి.. కిటికీని ఇనుపరాడ్డు సాయంతో పగులగొడతారు. అనంతరం కర్రకు టంగ్ క్లీనర్ కట్టి దాని సాయంతో కిటికీ టవర్ బోల్ట్‌ను తీసి.. ఆపై ఇంటి లోపలికి ప్రవేశిస్తారు. ఇకపై చేతికి గ్లోజులు ధరించి బంగారు ఆభరణాలు.. నగదు దొంగలించి పలాయనం చిత్తగిస్తారు.

 

అయితే అలా దొంగలించిన బంగారు ఆభరణాలను నరసరావుపేటలోని ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి .. వచ్చిన డబ్బుతో క్రికెట్ బెట్టింగ్ పెట్టడం.. జల్సాలు చేయడం వారికి షరా మాములు అయ్యింది. అయితే ఇలా మిర్యాలగూడలో 16కు పైగా ఇండ్లల్లో చోరీలు చేశారు. దీంతో ఇక్కడ నిఘా ఎక్కువకావడంతో వారి మకాం నల్లగొండకు మార్చారు. నల్లగొండ పట్టణంలోనూ దాదాపు 4 ఇండ్లకి పైగా చోరీలు చేశారు.

 

పారిపోతూ పోలీసుల చేతికి చిక్క :

ఇటీవల అలా దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను హైదరాబాద్ లో విక్రయించేందుకు అప్పటికే దొంగిలించిన మారుతి స్విఫ్ట్ (ఏపీ 35ఏజీ 1711) కారులో వెళుతుండగా నందిపాడు చౌరస్తా వద్ద పోలీసు తనిఖీలు చేస్తుండగా. పట్టుబడ్డారు. నిందితుల నుంచి 83 తులాల బంగారం 8 తులాల వెండి మారుతి స్విఫ్ట్ (ఏపీ 35ఏజీ 1711) కారు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా నిందితుల నుంచి రూ.60లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

 

ఈ కేసును చేధించిన మిర్యాలగూడ డీఎస్పీ పి. వెంకటగిరి సీఐలు నర్సింహారావు , జీతేందర్ రెడ్డి, మహా లక్ష్మయ్య సీసీయెస్, నల్లగొండ, రాఘవేందర్ ఇన్స్పెక్టర్ మిర్యాలగూడ 1 టౌన్ ఎస్ఐలు కృష్ణయ్య, రామ్మూర్తి శివకుమార్,రాంబాబు, హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధనగిరి, వెంకటేశ్వర్లు (V.T), కానిస్టేబుళ్లు కె.నరేశ్ కుమార్ అక్బర్, రామకృష్ణలను రవి, వెంకటేశ్వర్లు హోం గార్డ్స్ సోమ్లా నాయక్ నాయక్, దయాకర్ లను నల్లగొండ ఎస్పీ కె,అపూర్వరావు అభినందించారు.

 

ALSO READ : 

 1. TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!
 2. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
 3. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
 4. Gruhalakshmi : గృహ లక్ష్మీ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..!
 5. Land : భూమిని చూపిస్తారా, మమ్మల్నే చూసుకోమంటారా..?
 6. TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!
 7. ప్రేమ వేధింపులకు విద్యార్థిని బలి
 8. ఇరువర్గాల మధ్య భూ పంచాయతీ.. బైక్ దగ్ధం చేసిన గుర్తు తెలియని దుండగులు..!

 

అంతరాష్ట్ర ముఠాలకు చెల్లుచీటి : కె, అపూర్వరావు, నల్లగొండ ఎస్పీ

నల్లగొండ జిల్లాలో శాంతిభద్రతలే పరమాధిగా పనిచేస్తున్నాం. ఏలాంటి నేరప్రవృత్తి కలిగిన వారినైనా వదిలిపెట్టబోము, అంతరాష్ట్ర దొంగతనాల ముఠాపై స్పెషల్ ఫోకస్ పెట్టాం, జిల్లా పరిధిలోని ఏలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వబోము, కేసులను చేధించడంలో జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంది.