మిర్యాలగూడ : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

మిర్యాలగూడ : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
మిర్యాలగూడ, మనసాక్షి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి నార్కట్ పల్లి బైపాస్ సమీపంలో ఉన్న శరణ్య గ్రీన్ హౌస్ లో నివాసం ఉంటున్న రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది.
రైల్వే ఉద్యోగి చెరుపల్లి శ్రీనివాస్ 50వ ప్లాట్ నెంబర్ లో అద్దెకు ఉంటున్నాడు. ఉద్యోగ నిమిత్తం వెళ్లిన శ్రీనివాస్ శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూస్తే తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో చోరీకి పాల్పట్టు గుర్తించిన శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 12 తులాల బంగారం చోరీకి గురి అయినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
MOST READ :
- BREAKING : వేములపల్లి మండలంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. మహిళ మృతి..!
- TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!
- Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
- TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
- Telangana : ఆ రైతులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త..!