Telangana : ఆ రైతులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త..!

Telangana : ఆ రైతులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త..!
హైదరాబాద్, మనసాక్షి :
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఆయిల్ ఫామ్ రైతులకు శుభవార్త తెలియజేసింది. ఆయిల్ ఫామ్ తోటల్లో అంతర పంటల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గజ్వేల్ మండలంలోని సిరిగిరి పల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ తోటలో అంతర పంటగా సాగుచేసిన అరటి తోటను రైతు లక్ష్మణ్ దంపతులతో కలిసి పరిశీలించారు.
అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు లక్ష్మణ్ దంపతులు ఆదర్శంగా నిలిచారన్నారు. రైతులు అధిక ఆదాయాన్ని పొందే ఆయిల్ ఫామ్ తోటను సాగు చేస్తూ అంతర పంటలు సాగు చేసుకోవచ్చని వివరించారు.
MOST READ :
- Kodada : బీసీలకు రూ . లక్ష సహాయం షురూ..!
- వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
- Admin Review : కొత్త టూల్స్.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!
- Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!
ఆయిల్ ఫాం సాగు రైతులకు ఎంతో లాభదాయకమని, ఈ పంట ద్వారా మూడు, నాలుగు సంవత్సరాల తర్వాత పొందవచ్చు అన్నారు. కానీ అంతర పంటల సాగు వల్ల తోట పెట్టిన మొదటి సంవత్సరం నుంచే లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు.
జిల్లాలో పదివేల ఎకరాలు ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేయగా, ఈ ఏడాది మరో 10 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంటలు పండించేందుకు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు . ఆయిల్ ఫామ్ రైతులకు సబ్సిడీతోపాటు మొక్కలు, డ్రిప్, ఎరువులు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.