Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : వేములపల్లి మండలంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. మహిళ మృతి..!

BREAKING : వేములపల్లి మండలంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. మహిళ మృతి..!

వేములపల్లి , మనసాక్షి:

రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివా రులు అద్దంకి నార్కట్ పల్లి రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

 

వేములపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉదయం 04:00 నుండి 05:00 గంటల మధ్యలో వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులో గల అద్దంకి నార్కెట్ పల్లి హైవేలో మిర్యాలగూడ నుండి నల్గొండ పోతున్న హైవే రోడ్డు మీద ఒక గుర్తు తెలియని మహిళ రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ అయ్యి మరణించినది. మోహము (మొఖం) గుర్తుపట్టే విధంగా లేదు.

 

గుర్తులు:
1) మహిళ వయస్సు సుమారు 30 నుండి 35 సం!!రలు వుండవచ్చు.
2) వంకాయ , ఎరుపు రంగు చీర
3) తెలుగు ఎరుపు రంగు జాకెట్,
4) ఎరుపు, నలుపు రంగు మొఖానికి కట్టుకొనే చున్ని.
5) కుడి చేతి మీద ” శ్రీ ” అని, “త్రిశూలం” బొమ్మ కూడ పచ్చబొట్టు వుంది.
6) కుడి చేయి కి రింగ్ ఫింగర్ కి వినాయకుడు బొమ్మ వున్న ఉంగరం వుంది.
7)కాళ్ళకి మెట్టెలు మరియు పట్టీలు వున్నవి.

 

ఇట్టి మహిళను యవరు అయిన గుర్తు పట్టి నట్లు అయితే ఫోన్ సమాచారం అందించగలరు. వేములపల్లి
SI cell no: 8712670190,
CI cell no: 8712670151.

మరిన్ని వార్తలు