BIG BREAKING : వేములపల్లి : అదుపుతప్పి బైక్ ను ఢీ కొట్టిన బస్సు.. ఇద్దరు దుర్మరణం..!

BIG BREAKING : వేములపల్లి : అదుపుతప్పి బైక్ ను ఢీ కొట్టిన బస్సు.. ఇద్దరు దుర్మరణం..!

వేములపల్లి, మన సాక్షి:

బస్సు టైరు పగిలి ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ముగ్గురు ప్రయాణిస్తుండగా ఇద్దరు మృతిచెందగా మరొకరు పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఘటన వేములపల్లి మండలం అన్నపరెడ్డిగూడెం స్టేజి సమీపంలోని అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై సోమవారం ఉదయం చోటు చేసుకుంది.

 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు బస్సు అన్నపరెడ్డిగూడెం స్టేజి సమీపంలో రాగానే ముందు టైరు పగలడంతో బస్సు అదుపు తప్పి డివైడర్ దాటి అవతల పక్కన వేములపల్లి నుండి మిర్యాలగూడ వైపు వస్తున్న బైకును బలంగా ఢీ కొట్టింది.

 

దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు కంట్రోల్ కాకపోవడంతో పాటు పక్కనే ఉన్న పంట పొలాలకి వెళ్ళింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక చిన్నారితో పాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

 

క్షతగాతులను వెంటనే స్థానికులు వెంటనే అంబులెన్స్ సాయంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

 

MOST READ : 

  1. పీడలు సోకకూడదని .. ఊరు ఊరంతా వనభోజనాలు..!
  2. దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!
  3. సూర్యాపేట : జిల్లా కలెక్టర్ ను కుర్చీలో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తర్వాత..!
  4. Anusuya : వెక్కి వెక్కి ఏడ్చుతున్న యాంకర్ అనసూయ.. వీడియో వైరల్..!