పీడలు సోకకూడదని .. ఊరు ఊరంతా వనభోజనాలు..!

పంటలు సమృద్ధిగా పండాలని.. పిల్లలు ఆరోగ్యం కోసం

పీడలు సోకకూడదని .. ఊరు ఊరంతా వనభోజనాలు..!

పంటలు సమృద్ధిగా పండాలని.. పిల్లలు ఆరోగ్యం కోసం

ఊరు బాగు కోసం ఊరంతా ఖాళీ

నేలకొండపల్లి, మన సాక్షి.

గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని….ప్రజలకు ఎలాంటి పీడ లు రాకూడదని…పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని… ఊరు… ఊరంతా ఖాళీ చేసి వనభోజనాలకు వెళ్లారు… ఒకటి కాదు.. రెండు కాదు… ఏకంగా 800 కుటుంబాలు ఊరును ఖాళీ చేసి దూరంగా పంట పొలాల్లో వనభోజనాలకు తరలివెళ్లారు…. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని శంకరగిరితండా గ్రామంలో ఆదివారం వనబోజనాల కార్యక్రమం నిర్వహించారు.

 

ఊరంతా సుఖ సంతోషాలతో ఉండాలని… పాడిపశువులు సమృద్ధిగా ఉండాలని…పిల్లలు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఊరంతా ఖాళీ చేసి దూరంగా వన భోజనాలకు వెళ్లారు. గ్రామంలో ఒక్కరు కూడా ఉండకుండా. అంత దూరంగా పంట పొలాల వైపు వెళ్లారు… వారి కుల దైవం కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి. మొక్కులు చెల్లించుకున్నారు.

 

గ్రామంలో ఎవరైనా ఉంటే వారికి దరిద్రం పడుతుందనే వారి నమ్మకం అందుకే ఊరంతా ఖాళీ చేసి వన భోజనాలకు వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వంట వార్పులతో. ఆట పాటలతో సందడి చేశారు. చీకటి పడిన తర్వాత తండా వాసులంతా ఇళ్లకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జరుపుల దుర్గాబాయి. మాజీ సర్పంచ్ ది దీప్లా నాయక్ బి బాబు గ్రామ పెద్దలు తేజావత్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

 

MOST READ : 

  1. మళ్లీ వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే : ముఖ్యమంత్రి కేసీఆర్
  2. దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!
  3. సూర్యాపేట : జిల్లా కలెక్టర్ ను కుర్చీలో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తర్వాత..!
  4. మిర్యాలగూడ : ఓటరు అవగాహణ ర్యాలీ.. 5కె రన్ విజయవంతం..!