మిర్యాలగూడ : ఓటరు అవగాహణ ర్యాలీ.. 5కె రన్ విజయవంతం..!

మిర్యాలగూడ : ఓటరు అవగాహణ ర్యాలీ.. 5కె రన్ విజయవంతం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

ఓటరు అవగాహన, చైతన్యం కోసం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని NSP క్యాంప్ గ్రౌండ్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు శనివారం 5 K రన్ నిర్వహించడం జరిగింది.

 

ఈ కార్యక్రమాన్ని స్థానిక డిఎస్పి వెంకటగిరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లను సన్మానించడం, 5కే రన్ లో ముందున్న వ్యక్తులకు బహుమతులు అందించడం జరిగింది.

 

 

సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ SVEEP నోడల్ అధికారి ప్రతాప్ నాయక్ అక్కడికి విచ్చేసిన కళాశాల విద్యార్థులకు యువతకు పౌరులకు ఉపాధ్యాయులకు ఓటు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ మాట్లాడారు.

 

ఓటు అనేది వజ్రాయుధమని, ప్రతి ఒక్కరూ నిజాయితీగా తమ ఓటును వినియోగించుకోవాలని, యువత మేలుకొని ప్రజాస్వామ్యాన్ని ఏలుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటరే నిజమైన పాలకులుగా ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకోవాలని అన్నారు.

 

.ఈ కార్యక్రమంలో 5K రన్ లో మొదటి బహుమతి పొందిన గుడిపాటి కోటయ్యకు సీనియర్ సిటిజన్స్ కు శాలువా మెమొంటోలతో సన్మానం చేశారు.

 

ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్ ఐ నర్సింహులు, శ్రీను నాయక్, స్థానిక తహసిల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, జితేందర్ రెడ్డి, జానయ్య, సంగీత, మండల విద్యాధికారి బాలాజీ నాయక్ వివిధ మండలాల అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ :

1. Cooking : హోటల్లో వంట మాస్టర్ కానీ.. స్నేహితులతో కలిసి..!

2. మిర్యాలగూడ : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

3. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!

4. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!