మళ్లీ వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే : ముఖ్యమంత్రి కేసీఆర్

మళ్లీ వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే : ముఖ్యమంత్రి కేసీఆర్

రూ. 35 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం

సూర్యాపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

సూర్యాపేట ప్రతినిధి, ఆగస్టు 20 , మన సాక్షి :

రాష్ట్రం రాష్ట్రంలో మళ్లీ వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమే అని ఎవరికి ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లాలో నాలుగు శాసనసభ స్థానాలు బంపర్ మెజారిటీతో గెలుస్తామని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలను బి ఆర్ ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం మెడికల్ కళాశాల ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ప్రారంభించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు . ధరణి తీసేస్తా అనే కాంగ్రెస్ వాళ్ళను గంగలో కలపాలన్నారు.

 

ఓట్ల కోసం వచ్చినప్పుడు ఆగం కావద్దని ధరణి తెచ్చి అన్నదాతలకు అధికారాలను అప్పజెప్పామన్నారు. మళ్లీ ఆ అధికారాలను గుంజుకునే కుట్ర కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని.. విచక్షణతో ఆలోచన చేయాలని, ఎన్నో పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను మీ కళ్ళ ముందు ఉన్నాయని సూర్యాపేటకు కాలేశ్వరం జలాలు వచ్చాయా..

 

సూర్యాపేట జిల్లా ప్రగతి చూస్తుంటే ఎంతో ఆనందాంగ ఉందని, జిల్లాలో 475 గ్రామపంచాయతీలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీకి 50 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. జగదీశ్ రెడ్డి గెలిస్తే సూర్యాపేట జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట ప్రకారం జిల్లా ఏర్పాటు చేశామని , ఇవాళ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఏమన్నా కొత్తవా వాళ్ళ .. సక్కదనం ఎవరికీ తెలవదు..

 

ఏనాడైనా అభివృద్ధి గురించి ఆలోచన చేశారా..? ఇప్పుడు నల్లగొండ పట్టణం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసినామన్నారు కులం జాతి మతం లేదని అందరూ మనవాళ్లే అందరూ బాగుకోసం కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వాళ్లకు ఓటేస్తే ఉన్నది పోద్ది వాళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పథకాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు . సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గం వస్తున్నాయో రావడం లేదో మీరే చెప్పాలని సీఎం కేసీఆర్ అన్నారు.

 

ALSO READ :

  1. దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!
  2. సూర్యాపేట : జిల్లా కలెక్టర్ ను కుర్చీలో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తర్వాత..!
  3. Anusuya : వెక్కి వెక్కి ఏడ్చుతున్న యాంకర్ అనసూయ.. వీడియో వైరల్..!
  4. TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!

విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో 60 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధిని కేవలం ఆరేళ్లలోనే చేశారని అన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలుపుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కింది అన్నారు .

 

సూర్యాపేట పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయడమే కాకుండా అద్భుతమైన భవనాలు నిర్మించాలని అన్నారు సూర్యాపేట జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటుందన్నారు. ఇవాళ సూర్యాపేటలో ప్రగతి పండుగ కనిపిస్తుందన్నారు. ఆనాడు సూర్యాపేటలో ఆకలి కేకలు వినబడ్డాయని.. ఆనాడే కేసీఆర్ గ్రామ గ్రామం తిరిగి ప్రజలకు ధైర్యం చెప్పారని, క్లోరైడ్ బాధితులకు అండగా నిలబడ్డారు అన్నారు. ఆరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా నిలిచిందన్నారు . కృష్ణ గోదావరి జలాలతో సూర్యాపేట సస్యశ్యామలంగా మారిందని , కాలేశ్వరం ప్రాజెక్టుతో సూర్యాపేట రూపురేఖలు మారాయి అన్నారు.