మిర్యాలగూడ : ఏటీఎంలు చోరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి అరెస్టు..!

మిర్యాలగూడ : ఏటీఎంలు చోరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి అరెస్టు..!

మిర్యాలగూడ , మన సాక్షి

ఏటీఎం దొంగతనాలకు పాల్పడే అంతర్ రాష్ట్ర దొంగ ను మిర్యాలగూడ పోలీసులు సోమవారం అరెస్టు చేశార మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్ పేటలోని ఎల్ఐసి కార్యాలయం సమీపంలో హర్ష బేకరీ వద్ద ఏటీఎం చోరీలకు పాల్పడే షారుక్ షాబుద్దీన్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

 

ఏటీఎం చోరీలకు పాల్పడేందుకు హర్యానా రాష్ట్రం నుంచి తనతో పాటు మరో ఇద్దరు కలిసి తెలంగాణకు వచ్చినట్లు తెలిపారు. అందుకుగాను అతను వద్ద ఏటీఎం చోరీకి పాల్పడడానికి అవసరమైన గ్యాస్ కట్టర్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

 

ALSO READ : 

  1. BIG BREAKING : వేములపల్లి : అదుపుతప్పి బైక్ ను ఢీ కొట్టిన బస్సు.. ఇద్దరు దుర్మరణం..!
  2. Anusuya : వెక్కి వెక్కి ఏడ్చుతున్న యాంకర్ అనసూయ.. వీడియో వైరల్..!
  3. దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!
  4. పీడలు సోకకూడదని .. ఊరు ఊరంతా వనభోజనాలు..!

 

దొంగతనానికి పాల్పడిన మారుతి ఈకో కారులో నల్గొండ నుంచి మిర్యాలగూడ కు రాగా అతనిని పట్టుకున్నట్లు తెలిపారు. నల్గొండలో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించగా అక్కడ పోలీసుల పహారా ఎక్కువగా ఉండటంవల్ల మిర్యాలగూడకు వచ్చే క్రమంలో అరెస్టు చేసినట్లు తెలిపారు.

 

పట్టణ ప్రజలు తమ విలువైన వాహనాలు ఇతర వస్తువులను ఇంటి ముందు రోడ్లపై కాకుండా ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకొని పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.