Gruhalakshmi : గృహ లక్ష్మీ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..!

ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Gruhalakshmi : గృహ లక్ష్మీ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..!

ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ములుగు, మన సాక్షి

ఆగస్టు 10 లోపు గృహలక్ష్మి కింద లబ్ధి కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గృహలక్ష్మి పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు.

 

ములుగు జిల్లాలో ఉన్న ములుగు అసెంబ్లీ నియోజకవర్గానికి 2590 ఇండ్లు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మండలాలకు 1200 ఇండ్లను, జిల్లాకు మొత్తం 3790 గృహలక్ష్మి ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో గృహలక్ష్మి పథకం కోసం వచ్చిన దరఖాస్తుల జాబితా తయారు చేస్తున్నామని, గృహలక్ష్మి పథకం లబ్ధి కోసం అవసరమైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 10 తారీఖు లోగా మండల కార్యాలయాల్లో, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక గృహలక్ష్మి కౌంటర్లలో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.

 

ALSO READ : 

  1. Education : తెలంగాణలో కెసిఆర్ విద్యా కానుక..!
  2. Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!
  3. PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!
  4. UGC : ఆ యూనివర్సిటీలు ఫేక్.. ఆ డిగ్రీలు చెల్లవు..!
  5. Murder : రూ 50 వేల సుపారి, రూ. 5 వేల అడ్వాన్స్.. జంట హత్యలు..!

 

ఆగస్టు 10వ తారీఖు వరకు వచ్చిన దరఖాస్తుల జాబితా రూపొందించి జిల్లాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి విచారణ చేపడతామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆహార భద్రత కార్డు ఉన్నవారికి, సొంత ఇండ్లు లేని వారికి, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 59 కింద లబ్ది పొందని వారిని అర్హులుగా ఎంపిక చేయడం జరుగుతుందని , ఆగస్టు 20వ తారీకు వరకు క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేసి, ఆగస్టు 25 నాటికి జిల్లాకు కేటాయించిన గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

 

గృహలక్ష్మి కింద లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ నిబంధనల మేరకు పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎటువంటి మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, గృహలక్ష్మి ఇండ్ల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే సమీప ప్రభుత్వ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని, ప్రతి మండల తహసిల్దార్ కార్యాలయంలో, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఆగస్టు 10లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు సమర్పించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.