ప్రేమ వేధింపులకు విద్యార్థిని బలి

ప్రేమ వేధింపులకు విద్యార్థిని బలి

కనగల్ , మన సాక్షి:

ప్రేమవేధింపులు తాళలేక మనస్థాపంతో గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థిని కదిరె మౌనిక (20) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఎస్సై ఎన్. అంతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…

 

కనగల్ మండలం లింగాలగూడెం గ్రామానికి చెందిన మౌనిక నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతోంది. స్వగ్రామం నుంచి ప్రతిరోజు కళాశాలకు వచ్చిపోతూ ఉండేది. ఈ క్రమంలో నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బొల్లం శ్రవణ్ తనను ప్రేమించమని మౌనికను మూడు నెలలుగా వేధించసాగాడు.

 

ALSO READ : 

  1. హైదరాబాదులో దారుణం.. మైనర్ బాలికపై తండ్రి కొడుకులు అత్యాచారం..!
  2. Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
  3. ఇరువర్గాల మధ్య భూ పంచాయతీ.. బైక్ దగ్ధం చేసిన గుర్తు తెలియని దుండగులు..!
  4. Admin Review : కొత్త టూల్స్‌.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!

 

ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ ఫోన్లు చేస్తూ వేధించడం, ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరిస్తూ ఈనెల 9న మధ్యాహ్నం ఎవరూ లేనీ సమయంలో మౌనిక ఇంటికి శ్రవణ్ వచ్చి ప్రేమించాలని బలవంత పెట్టడంతో మౌనిక కేకలు వేసింది. కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోవడంతో పారిపోతున్న శ్రవణ్ ను పట్టుకుని దేహశుద్ధి చేసి కనగల్ పోలీసులకు అప్పగించారు.

 

మనస్థాపం చెందిన మౌనిక ఇంట్లో ఉన్న గడ్డిమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత ఈనెల 11న శుక్రవారం తెల్లవారుజామున మౌనిక మృతి చెందింది. మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.