ఇరువర్గాల మధ్య భూ పంచాయతీ.. బైక్ దగ్ధం చేసిన గుర్తు తెలియని దుండగులు..!

ఇరువర్గాల మధ్య భూ పంచాయతీ.. బైక్ దగ్ధం చేసిన గుర్తు తెలియని దుండగులు..!

నేలకొండపల్లి, మన సాక్షి.

భూ తగదా నేపధ్యంలో ఇరువర్గాల మధ్య పంచాయతీ తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ఈ క్రమంలో ఓ వర్గం కు చెందిన వ్యక్తి బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని, ఆజయిండా గ్రామంలో ఇటీవల కొంత కాలం నుంచి భూ పంచాయతీ నడుస్తుంది.

 

ఓ వర్గం కు చెందిన – భానుప్రసాద్ అనే వ్యక్తి పొలం లో కోళ్ల ఫారమ్ ను నిర్మిస్తున్నారు. కాగా అదే గ్రామానికి చెందిన మరో వర్గం ఆ నిర్మాణంలో తమకు చెందిన పొలం ఉందని.. ఆక్రమణ లో నిర్మాణం చేపడుతున్నారని ఇటీవల -ఘర్షణలు జరుగుతున్నాయి.

 

ALSO READ :

  1. WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!
  2. అడవిదేవులపల్లి : బాల్నేపల్లిలో ఆస్తి కోసం హత్య
  3. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
  4. అప్పుడే పుట్టి చనిపోయిన ఆడ శిశువు మృతదేహం లభ్యం

 

ఆక్రమణ లో లేదని తన కు ఉన్న రిజిస్ట్రేషన్ ప్రకారమే తన పొలంలో నిర్మాణం చేపడుతున్నానని…లేదు ఆ భూమి తమదని.. రామారావు తో పాటు మరికొంత మంది వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో గ్రామానికి చెందిన తేజావత్ సైదులు అనే వ్యక్తి కి చెందిన ద్విచక్ర వాహనం ను వివాద స్థలం వద్ద నిలిపి ఉంచగా గుర్తు తెలియని దుండగలు పెట్రోల్ పోసి తగలబెట్టారు.

 

దీంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. బాధితుడు ఫిర్యాదు మేరకు నేలకొండపల్లి ఎస్సై బి. సతీష్ ఘటనా స్థలం కు చేరుకుని వివరాలు సేకరించారు. ఇది ఇలా ఉండగా…. గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదంగా మారి…ఉద్రిక్తత పరిస్థితులు